నువ్వు గ్రేట్‌ బాస్‌.. పెళ్లి కొడుకు పారిపోతే పెద్ద మనసు చేసుకుని పెళ్లికి ఒప్పుకున్నాడు, సినిమా కాదు రియల్‌ స్టోరీ

సినిమాల్లో పెళ్లిల్లు ఆగడం, పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకు లేచి పోతే లేదా ఇష్టం లేక పారిపోతే పెళ్లి పందిరిలో మరో అబ్బాయి అమ్మాయి మెడలో తాలి కట్టడం మనం చూస్తూనే ఉంటాం.పెళ్లిలు క్యాన్సిల్‌ అవ్వడం రియల్‌ లైఫ్‌ లో కూడా జరుగుతాయి.

 Another Man Marries After Bridegroom Escape-TeluguStop.com

కాని ఎక్కువగా పెళ్లిలు మళ్లీ అదే రోజు జరుగవు.సినిమాలో మాదిరిగా పెళ్లి పీఠల మీద పెళ్లి ఆగిపోకుండా ఏ ఒక్కరు కూడా ముందుకు వచ్చి నేనున్నాను అంటూ ముందుకు రారు.

కాని పెళ్లి పీఠల మీద పెళ్లి ఆగిపోవద్దనే ఉద్దేశ్యంతో రమేష్‌ అనే వ్యక్తి ఈ సాహసం చేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే సిద్ది పేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన రాజలింగు, భూలక్ష్మి దంపతుల కుమార్తెను పందిపెల్లి శ్రీనివాస్‌కు ఇచ్చి పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు.

అయితే శ్రీనివాస్‌కు ఈ పెళ్లి ఇష్టం లేదు.తల్లిదండ్రుల బలవంతంతో మేనమామ బిడ్డను పెళ్లి చేసుకునేందుకు ఓప్పుకున్నాడు.శ్రీనివాస్‌ ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక పోవడంతో పాటు, ముందు నుండి ప్రేమించిన అమ్మాయికి అన్యాయం చేసేందుకు మనసు ఒప్పుకోలేదు.దాంతో శ్రీనివాస్‌ పెళ్లి రోజు పారిపోయాడు.

పెళ్లి మండపానికి అమ్మాయి తరపు వారు పెళ్లి కొడుకును తీసుకు వచ్చేందుకు వెళ్లారు.కారులో పెళ్లి కొడుకును తీసుకు వస్తున్నారు.

ఆ సమయంలోనే పెళ్లి కొడుకు పారిపోయాడు.అవాక్కయి పెళ్లి పిల్ల తరపు బందువులు కళ్యాణ మండపంకు వెళ్లి జరిగిన విషయం వధువు తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది.

వధువుకు గతంలో శ్రీనివాస్‌ తో కాకుండా రమేష్‌ అనే వ్యక్తితో పెళ్లిని అనుకున్నారు.అయితే శ్రీనివాస్‌ తల్లి ఒత్తిడితో రమేష్‌ను కాదని మేనల్లుడికి ఇచ్చి చేసేందుకు రాజలింగు ఒప్పుకున్నాడు.శ్రీనివాస్‌ ఇలా చేయడంతో రాజలింగు రమేష్‌ ను అడిగాడు.రమేష్‌ మరో ఆలోచన లేకుండా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చాడు.పెళ్లి క్యాన్సిల్‌ అయ్యిందనుకున్న సమయంలో రమేష్‌ ముందుకు వచ్చి పెళ్లి చేసుకోవడంతో రామలింగు దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

శ్రీనివాస్‌ మరియు రమేష్‌ లు ముందుగానే ప్లాన్‌ చేసుకుని ఇలా చేసి ఉంటారు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మొత్తానికి పెళ్లి ఆగిపోకుండా జరిగినందుకు రాజలింగు అండ్‌ ఫ్యామిలీ హ్యాపీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube