తమిళ 'అర్జున్‌ రెడ్డి'ని చెత్త బుట్టలో వేయడానికి ప్రధాన కారణం ఇదే... ఆ నష్టం భరాయించేది ఎవరో తెలుసా?

తెలుగులో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న అర్జున్‌ రెడ్డి చిత్రాన్ని తమిళంలో ‘వర్మ’ అనే టైటిల్‌ తో ధృవ్‌ హీరోగా బాల దర్శకత్వంలో తెరకెక్కించిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ తమిళనాట ప్రారంభం అయిన ఆ సినిమా షూటింగ్‌ అంతా పూర్తి చేసుకున్న తర్వాత త్వరలో విడుదల కాబోతుందని ఎదురు చూస్తున్న సమయంలో ‘వర్మ’ సినిమా మొత్త రీ షూట్‌ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

 What Is The Reason For Tamil Arjun Reddy Goes To In Dust Bin-TeluguStop.com

సినిమా షూటింగ్‌ అంతా పూర్తి అయ్యి రషెష్‌ చూసిన తమకు ఏమాత్రం సంతృప్తి కరంగా అనిపించలేదని, అందుకే సినిమాను మొత్తం రీ షూట్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా నిర్మాత ప్రకటించాడు.

‘వర్మ’ చిత్రం కోసం నిర్మాతలు దాదాపుగా అయిదు కోట్ల రూపాయలను ఖర్చు చేశాడు.అయిదు కోట్ల రూపాయలు ఇప్పుడు వృదా అన్నట్లే.నిర్మాత అంత నష్టంను భరించడం చాలా భారం.

సినిమా ఎలా ఉన్నా కూడా విడుదల చేస్తే అందులో సగం అయినా వెనక్కు వచ్చే అవకాశం ఉంది.కాని సినిమా మొత్తం చెత్త బుట్టలో పడేయడంతో అయిదు కోట్ల రూపాయలను కూడా చెత్త బుట్టలో వేసినట్లే అంటున్నారు.

అయితే ఇంత భారంలో సగం నష్టంను హీరో విక్రమ్‌ భరాయించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.విక్రమ్‌ తనయుడే దృవ్‌ అనే విషయం తెల్సిందే.

తన కొడుకు మొదటి సినిమాతో ఆకట్టుకోలేక పోతే ఇక కెరీర్‌ మొత్తం కూడా అలాగే ఉంటుందనే ఆందోళన వ్యక్తం చేశాడు.

‘వర్మ’ మొత్తం రీ షూట్‌కు ప్రధాన కారణం విక్రమ్‌ అంటున్నారు.రసెష్‌ పై ఏమాత్రం సంతృప్తి వ్యక్తం చేయని విక్రమ్‌ మొత్తం రీ షూట్‌ చేయాలని, అందుకు తన వంతు సాయం చేస్తానంటూ ముందుకు వచ్చాడు.సగం బడ్జెట్‌ ఇవ్వడం తో పాటు, మీ బ్యానర్‌లో ఒక సినిమాను కూడా నేను చేస్తానంటూ ఆ నిర్మాతలకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

అందుకే వర్మ సినిమా మొత్తం రీ షూట్‌కు చిత్ర నిర్మాత ముందుకు వచ్చాడు.అతి త్వరలోనే రీ షూట్‌ మొదలు కాబోతుంది.ప్రస్తుతం స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు మరియు దర్శకుడి ఎంపిక జరుగుతోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube