తమది ఏ కులమో ... చెప్పిన డీజీపీ !

పోలీస్ శాఖలో ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కీలక పదవుల్లో ఉన్నారని… వారి వల్ల ఎన్నికలు సజావుగా సాగే అవకాశం ఉన్నట్టు కనిపించడంలేదు అని నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ అధినేత జగన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులపై జగన్ చేసిన ఆరోపణలపై ఏపీ డీజీపీ ఠాకూర్ స్పందించారు.

 Dgp Thakur Comments On Ycp Cheif Jagan Complaint-TeluguStop.com

పోలీసులకు కులం ఉండదని, తమది ఖాకీకులమని అన్నారు.

హైకోర్టు నిర్దేశం ప్రకారమే ప్రమోషన్ల విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు.ప్రమోషన్లపై జ్యుడీషియల్‌ స్క్రూటినీ ఉంటుందని అన్నారు.డీజీగా ఉన్నప్పటి నుంచి తానేంటో అందరికీ తెలుసునని, నిజాయితీగా పనిచేస్తున్నానని చెప్పారు.

ఈసీ నుంచి రాత పూర్వకంగా వస్తే సమాధానం ఇస్తామని డీజీపీ స్పష్టం చేశారు.ప్రమోషన్లు మెరిట్ ప్రకారమే ఇచ్చామని చెప్పారు.

సీనియారిటీ లిస్టు.హైకోర్టు ఆదేశాల మేరకే తయారు చేశామని, ఆ మేరకే ప్రమోషన్లు ఇచ్చామని డీజీపీ పేర్కొన్నారు.సామాజికవర్గానికి చెందిన.35మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్‌ ఇచ్చారని నిన్న జగన్ ఆరోపించిన విషయం తెల్సిందే.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube