ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఈ పాపతో నారాయణ, చైతన్య టెక్నో సూల్స్‌ 10వ తరగతి వారికి పోటీ పడే దమ్ము ఉందా?

ప్రభుత్వ పాఠశాలలో చదువు అంటే అంతా కూడా చిన్న చూపు చూస్తూ ఉంటారు.కనీస వసతులు లేకుండా ప్రభుత్వ స్కూల్స్‌ నడుస్తూ ఉంటాయి.

 Govt School Student Spandana English Speech On Republic Day-TeluguStop.com

ఇక అక్కడ మంచి చదువు ఎక్కడ నుండి వస్తుంది అనేది చాలా మంది అభిప్రాయం.అందుకే ఇండియాలో విద్యను వ్యాపారం చేస్తూ ప్రైవేట్‌ విద్యా సంస్థలు రాజ్యం ఏలుతున్నాయి.

ప్రభుత్వంకు చేతకాక పోవడంతో ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారు.అయితే అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఒకే గాటిన కట్టేయడం కరెక్ట్‌ కాదని ఈ పాప నిరూపించింది.

వరంగల్‌ జిల్లా కట్టు కాల్వ తండాకు చెందిన ఒక గిరిజన బాలిక స్పందన ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది.ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఇంగ్లీష్‌ రాదనే అభిప్రాయం అందరిలో ఉంటుంది.

కాని స్పందన మాత్రం కేవలం 5వ తరగతికే అద్బుతమైన ఇంగ్లీష్‌ పరిజ్ఞానంను పెంచుకుంది.తాజాగా రిపబ్లిక్‌ డే సందర్బంగా స్పందన ఇచ్చిన స్పీచ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

అద్బుతమైన ఇంగ్లీష్‌ పరిజ్ఞానం ఉన్న స్పందనను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.స్పందనను మాత్రమే కాకుండా ఆ స్కూల్క్‌ఉ చెందిన ప్రతి ఒక్క టీచర్‌ను కూడా అభినందించాల్సిందే.

ఒక ప్రైమరీ స్కూల్‌ లెవల్‌ పాప ఇంత అద్బుతమైన ఇంగ్లీష్‌ను మాట్లాడటం నిజంగా ఆశ్చర్యం.కేవలం స్పందన మాత్రమే కాకుండా అక్కడ పిల్లలంతా కూడా ఇంగ్లీష్‌లో దారాలంగా మాట్లాడేలా అక్కడ టీచర్స్‌ వారికి బోధన చేస్తున్నారు.ప్రభుత్వ టీచర్స్‌ అంటే ఎంతో కష్టపడి చదివి మంచి జ్ఞానంతో ఉద్యోగం సంపాదిస్తారు.కాని వారు స్కూల్‌లో చేరిన తర్వాత పిల్లలను మాత్రం పట్టించుకోరనే విమర్శలు ఉన్నాయి.

ఈ విషయంలో ఆ తండా స్కూల్‌ పిల్లలను మరియు టీచర్స్‌ను అభినందించకుండా ఉండలేం.

లక్షల ఫీజ్‌లు, డొనేషన్స్‌ అంటూ వసూళ్లు చేసే నారాయణ, శ్రీచైతన్య టెక్నో స్కూల్స్‌కు సంబంధించిన పిల్లలు కూడా ఈస్థాయిలో ఇంగ్లీష్‌ మాట్లాడలేరు.శ్రీచైతన్యకు చెందిన 10వ తరగతి పిల్లలు బట్టి విధానంలో ఇంగ్లీష్‌ మాట్లాడతారు.కాని స్పందన మాత్రం చాలా అనర్ఘలంగా స్వాతంత్య్ర సమరయోధులపై స్పీచ్‌ ఇచ్చి వావ్‌ అనిపించింది.

నిజంగా ఆ టీచర్స్‌కు మరియు స్పందనకు హ్యాట్సప్‌ చెప్పాల్సిందే.

ప్రభుత్వ పాఠశాలలను చిన్న చూపు చూసే వారికి అర్థం అయ్యేలా ఈ విషయాన్ని షేర్‌ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube