ఆమె చీరకు తెలంగాణ ఆర్టీసీ నష్టపరిహారం చెల్లించింది... అందరికి ఉపయోగపడే విషయం ఇది

మన ఆర్టీసీ బస్సులు దారుణంగా ఉంటాయి.ఎప్పటివో ఇంకా నడుపుతూనే ఉంటారు.

 Rtc Pay 3000 Rupees Penalty To Passenger-TeluguStop.com

పాత వాటికి మరమత్తులు చేసి నడిపిస్తూ ఉంటారు.ఆర్టీసీ నష్టాల్లో ఉన్న కారణంగా పెద్ద మొత్తంలో కొత్త బస్సులు కొనే పరిస్థితి లేక పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాత వాటినే జాగ్రత్తగా నడుపుతున్నారు.

అది సరే కాని బస్సులు పాతవి అయినా కాస్త జాగ్రత్తగా మరమత్తులు చేస్తే బాగుంటుంది.ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండాలి.

బస్సులో రేకులు లేచి ఉండటం, కొన్ని ఇరిగి ఉండటం వల్ల కుచ్చుకుంటూ ఉంటాయి.

తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఒక సూపర్‌ లగ్జరీ బస్సు ఎక్కే సమయంలో ఉన్న మెట్ల వద్ద ఒక రేకు లేచి ఉంది.

అది చూడకుండా ఎక్కితే కాలుకు గాయం అవ్వడంతో పాటు, డ్రస్‌లు కూడా చిరిగే ప్రమాదం ఉంది.ఆ విషయాన్ని డ్రైవర్‌ పట్టించుకోలేదు.ఏం కాదులే అనుకున్నాడు.బస్సు సర్వీస్‌ చేసిన వారు కూడా అదే అనుకున్నాడు.

ఆ బస్సులో నల్లగొండ నుండి హైదరాబాద్‌కు కట్టెకోల నరసింహారావు, వాణిశ్రీ దంపతులు ప్రయాణం అయ్యారు.బస్సు ఎక్కే సమయంలో ఆ లేచి ఉన్న రేకు వల్ల వాణిశ్రీ కొత్త పట్టు చీర చినిగి పోయింది.

దాంతో కట్టెకోల నరసింహారావు డ్రైవర్‌ను ప్రశ్నించాడు.అతడు ఈ విషయం తన పరిధిలోకి రాదని, ఉన్నతాధికారులను సంప్రదించాలని కోరాడు.

నరసింహారావు ఈ విషయాన్ని తేలికగా తీసుకోలేదు.డిపో మేనేజర్‌ను కోరాడు.చిన్న విషయమే కదా అండి వదిలేయండి అంటూ పట్టించుకోలేదు.దాంతో కోపంతో ఊగిపోయిన నరసింహారావు వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేశాడు.వినియోగదారుల ఫోరంలో ఆరు నెలలు విచారించి వారం రోజుల క్రితం తీర్పు ఇచ్చింది.బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఆమె చీర చినిగి పోయింది, కనుక బస్సు యాజమాన్యం అయిన టీఎస్‌ ఆర్టీసీ వారు ఆమెకు మూడు వేల రూపాయలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

తమ తీర్పును అమలు చేయకపోతే కఠిన చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరించింది.

ఈ వినియోగ దారుల ఫోరం అనేది అద్బుతమైన అస్త్రం.ఏదైనా వస్తువు కొని మోసపోయినా లేదంటే ఏదైనా సేవలో మీకు ఇబ్బంది కలిగినా కూడా అక్కడ ఫిర్యాదు చేయవచ్చు.కేవలం ప్రభుత్వ సేవలు మాత్రమే కాదు, ప్రైవేట్‌ సేవలు కూడా ఈ పరిధిలోకి వస్తాయి.

ఉదాహరణకు మీరు ఒక కిరాణా షాప్‌లో సబ్బు తీసుకు వెళ్లారు.ఆ సబ్బు సరిగా పని చేయక పోగా, నష్టాన్ని కలిగిస్తే మీరు ఆ కిరాణా షాప్‌ పై వినియోగదారుల ఫోరంకు వెళ్లి న్యాయం పొందవచ్చు.

ప్రతి జిల్లా కేంద్రంలోని కోర్టులో కూడా వినియోగదారుల ఫోరం ఉంటుంది.పెద్దగా ఖర్చు లేకుండానే అక్కడ న్యాయం జరుగుతుంది.

చిన్న విషయమే కదా వదిలేద్దాం అనుకుంటే అవి కాస్త పెద్దవి అవ్వడం ఖాయం.అందుకే చిన్న చిన్న విషయాలు అంటూ లైట్‌ తీసుకోకుండా వినియోగదారుల ఫోరంకు వెళ్లడం మంచిది.

నలుగురికి ఉపయోగపడే ఈ విషయాన్ని షేర్‌ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube