యాంకర్ సుమ అదరహో...! వేల ఎపిసోడ్స్ తో ఇండియాలోనే సంచలన రికార్డు..!

సుమ కనకాల.తెలుగు టెలివిజన్ రంగంలో మకుటం లేని మహరాణి.

 Anchor Suma Creates Indian Record With Star Mahila Show-TeluguStop.com

యాంకరింగ్ రంగంలో తనదైన శైలిలో ఎన్నో ఏళ్లుగా దూసుకుపోతుంది.స్పాంటేనియస్ గా పంచ్ లు వేయడంలో సుమ తర్వాతే ఎవరైనా.

అందుకే చిన్నా పెద్దా తేడాలేకుండా అందరూ సుమని అభిమానిస్తారు.ఒకవైపు టివి ప్రోగ్రాములు,మరోవైపు ఆడియో ఫంక్షన్లకు యాంకరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సుమ.ఏడాది మొత్తం బిజీ షెడ్యూల్ సుమ గారిది.ఏ చానెల్‌లో చూసినా ఆమె కనిపిస్తుంది.

నవ్వుతూ, నవ్విస్తూ సెటైర్లు వేస్తూ ప్రోగ్రాంని రక్తికట్టిస్తుంది.

తాజాగా ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ టెలివిజన్ షో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది.

ఏకంగా 11 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్న స్టార్ మహిళ కార్యక్రమానికి సుమ ఏకైక యాంకర్.స్టార్ మహిళ కార్యక్రమం దేశంలోనే అతి సుదీర్ఘంగా సాగుతున్న కార్యక్రమంగా రికార్డుకెక్కింది.

2008 ఆగస్టు 9న ఈ కార్యక్రమం ప్రారంభమైంది.నేటి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది.ఇది టెలివిజన్ రంగంలో ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు.ప్రస్తుతం 3 వేల ఎపిసోడ్స్ పూర్తి చేసుకొన్నది.ఒకే కార్యక్రమం ఇన్ని ఎపిసోడ్స్‌గా కొనసాగడం నిజంగా అభినందనీయం.ఈ షోకు అంత గుర్తింపు రావడానికి ప్రధాన కారణం సుమ గారే అని చెప్పుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube