మళ్లీ మొదలుపెట్టిన టీడీపీ ... అలా అయితేనే వర్కవుట్ అవుతుందా ...?

ఏపీలో వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు ఒకదానికొకటి పోటీలు పడుతున్నాయి.గెలుపు గుర్రం ఎక్కేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.

 Tdp Starts Again Operation Akarsh Program For Ap Elections-TeluguStop.com

ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ… రాజకీయ రణరంగంలో ముందుకు వెళ్లేందుకు కత్తులు దూసుకుంటున్నాయి.

అందుకే తమ బలం ను నమ్ముకునే కంటే… తమ ప్రత్యర్థుల బలహీనతలను తెలుసుకుని దెబ్బ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇప్పటికే ఏపీలోవైసీపీ , జనసేన పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో పార్టీలో చేరికలపై ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు.

ఇప్పటి వరకు జాతీయ రాజకీయాలు, జన్మభూమి మా ఊరు కార్యక్రమాలపై దృష్టి సారించిన చంద్రబాబు ఇకపై పార్టీలో వలసలపై దృష్టిపెట్టి ఆపరేషన్ ఆకర్ష్ పధకాన్ని మళ్లీ ప్రారంబించాలనియు చూస్తున్నారు.

అందుకే ముందుగా తమ ప్రత్యర్థి పార్టీలు ఎక్కడెక్కడ బలహీనంగా ఉంది…? ఏ ఏ నాయకులు అసంతృప్తిగా ఉన్నారో తెలుసుకుని సైకిల్ ఎక్కించేందుకు ఎక్కించేందుకు చూస్తున్నాడు ఈ విధంగానే మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు, మాజీమంత్రి అహ్మదుల్లా, మాజీమంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపీ సబ్బం హరిలను పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలికారు.వీరిలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల తెలుగుదేశం పార్టీలో చేరతానని చంద్రబాబుకు స్పష్టం చేశారు.

ఘట్టమనేని ఆది శేషగిరిరావు సైతం త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు.ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన సంక్రాంతి తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నాడు.

అసలు శేషగిరి రావు తెనాలి అసెంబ్లీ టికెట్ ఆసనించగా జగన్ నో చెప్పడంతో … అలక చెందారు.దీంతో టీడీపీ ఆయనతో మంతనాలు జరిపి పార్టీలోకి వచ్చేలా ప్లాన్ చేశారు.అలాగే… మాజీమంత్రి అహ్మదుల్లా సైతం అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.ముస్లిం సామాజిక వర్గంలో మంచి పట్టున్న నేపథ్యంలో ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.

ఈ విధంగా ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ… టీడీపీ ఇతర పార్టీ నాయకులకు గేలం వేస్తూ… బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube