జగన్ ప్రకటించబోయే లిస్ట్ అంత పెద్దదా ...? ఇలా ఎందుకో ...?

వైసీపీ అధినేత జగన్ రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికార పీఠం దక్కించుకోవడానికి పక్క రాష్ట్రాల్లో అమలైన సక్సెస్ ఫుల్ వ్యూహాలను ఎటువంటి మొహమాటాలు లేకుండా ఇక్కడా అమలు చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు తహతహలాడుతున్నాడు.ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారారానికి దూరం అవ్వకూడదు అనే ఆలోచనతో జగన్ ముందుకు వెళ్తున్నాడు.

 Ys Jagan Going To Announce Ycp Candidates List Soon-TeluguStop.com

గత ఎన్నికల్లో అభ్యర్తులను ప్రకటించే విషయంలో జగన్ చేసిన తప్పు కారణంగా… కొద్ది శాతం ఓట్ల తేడాతో ఓడి ప్రతిపక్షంలో కూర్చుకున్నారు.ఈ సారి అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అందుకే తెలంగాణ కేసీఆర్ పాటించి అమలు చేసిన సక్సెస్ ఫుల్ ఫార్ములాను ఇక్కడా అమలు చేసేందుకు సిద్ధం అయ్యాడు.

జగన్ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం చివరి దశకు చేరింది.సంవత్సరానికి పైగా పాదయాత్రలో ఉన్న జగన్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కలుసుకొని వారి సమస్యలను వింటూ అధికారంలోకి వస్తే తాము ఏమి చెస్తామో భరోసా ఇస్తూ ముందుకు వెళ్ళాడు.అంతే కాదు పాదయాత్ర సమయంలో సామాన్యుల కాస్త నష్టాలను చాలా దగ్గరగా చూసాడు.అందుకే పాదయాత్ర సమయంలోనే ఏ నియోజకవర్గంలో ఏ పరిస్థితి ఉంది…? ఎక్కడ ఎవరికీ టికెట్ ఇస్తే బాగుంటుంది అనే విషయాలపై జగన్ ఒక అవగాహనకి వచ్చేసాడు.అలాగే… ప్రశాంత్ కిషోర్ సర్వే ఒకవైపు… మరో పక్క తన సొంత సర్వేల వివరాలు జగన్ వద్ద ఉన్నాయి.అ సర్వే వివరాల ప్రకారం పార్టీ తరుపున గెలుపు గుర్రాల లిస్ట్ రెడీగా ఉందట.

ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించడంతో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నారు.

దీనిలో భాగంగానే టీడీపీ సంక్రాంతి తర్వాత ప్రకటిస్తారనే వార్తలు వస్తున్నాయి.మరో వైపు జనసేన కూడా జనవరి 26 న అభ్యర్థులను ప్రకటిస్తామని ప్రకటించారు.జగన్ కూడా 9న అభ్యర్తుల జాబితాను విడుదల చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి.

మెుదటి విడతలో భాగంగా 52 మంది అభ్యర్థులను ప్రకటించనున్నారని వారిలో 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అలాగే 10 మంది ఎంపీ అభ్యర్థులను కూడాప్రకటిస్తారంటూ ప్రచారం ఊపందుకొంది.అయితే 9న అభ్యర్తుల ప్రకటన ఉండదని పార్టీలో కీలక నాయకులు కొందరు వ్యాఖ్యానిస్తుంటే జగన్ వద్ద దాదాపు 150 మంది అభ్యర్థుల లిస్ట్ రెడీ గా ఉందని…మరో కొద్ది రోజుల్లోనే ఆ పేర్ల ప్రకటన ఉండబోతున్నట్టు మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube