అమెరికాలో గన్ ఫైర్..3 మృతి.

అమెరికాలో మరో సారి కాల్పులు జరిగాయి.అగ్ర రాజ్యంగా చెప్పుకునే అమెరికా ఇటువంటి గన్ కల్చర్ ని అరికట్టడంలో మాత్రం ఘోరంగా విఫలం అవుతోందని చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ.

 Gun Fire At Global House In America-TeluguStop.com

గడిచిన రెండు నెలల కాలంలో అమెరికాలో దాదాపు ఇలాంటి సంఘటన జరగడం ఇది 5వ సారి అంటున్నాయి అమెరికా మీడియా వర్గాలు.

ఈ దుర్ఘటన లాస్ ఏంజెల్స్‌కు సమీపంలోని ఓ గేమింగ్ కాంప్లెక్స్‌లో చోటు చేసుకుంది.ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని కాలిఫోర్నియా పోలీసులు తెలిపారు.అయితే ఈ ఘటనలో బాధితులందరూ పురుషులేనని శుక్రవారం రాత్రి 11.50 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

అయితే గేమింగ్ కాంప్లెక్స్‌లో ఓ గొడవ జరిగిందని.ఈ ఘర్షణ కారణంగానే కాల్పులు జరిగాయని అక్కడి ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఈ కేసు విషయంపై విచారణ జరుపుతున్నామని పోలీసు అధికారులు తెలిపారని అమెరికా మీడియా తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube