అబ్బ... పుడితే ఇలాంటి తండ్రికి కూతురుగా పుట్టాలి... ఆ కూతురుది అదృష్టం మాత్రమే కాదు, దురదృష్టం కూడా

డబ్బున్న వారికి ఏదైనా సాధ్యమే, డబ్బుతో ఏదైనా సాధించొచ్చు అనేది ఇప్పుడు అంతా అనుకుంటున్న సత్యం.డబ్బుతో నిజంగానే సర్వం కొనుగోలు చేయవచ్చు, దక్కించుకోవచ్చు అనేది కొన్ని సంఘటనలు చూస్తుంటే అర్థం అవుతుంది.

 Rich Indian Dad Hires 12 Servants For Daughter In Uk College-TeluguStop.com

డబ్బున్న వారి ఇంట్లో ప్రతిది కూడా అలాగే ఉంటుంది.ఇక ఇండియాకు చెందిన ఒక బిలియనీర్‌ తన కూతురును ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు పంపించాడు.

ఆ సమయంలో ఆమె ఎలాంటి ఇబ్బంది పడకుండా, అక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆమె కోసం ఏకంగా పన్నెండు మంది సిబ్బందిని ఆమె కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది.

స్కాట్‌ల్యాండ్‌లోని సెయింట్‌ ఆండ్రూ యూనివర్శిటీలో ఉన్నత విద్య కోసం వెళ్లిన తన కూతురుకు ఏ చిన్న ఇబ్బంది కలుగకుండా అక్కడ ఖరీదైన ఒక భవనంను తీసుకున్నాడు.ఆ భవనంలో ఒక హౌస్‌ మేనేజర్‌, ముగ్గురు హౌస్‌ కీపర్లు, ఒక గార్డెన్‌, ఒక లేడీ మెయిడ్‌, ఒక బట్లర్‌, ముగ్గురు ఫూట్‌మెన్‌, ఒక ప్రైవేట్‌ చెఫ్‌, ఒక డ్రైవర్‌ ఆమె కోసం పని చేసేందుకు నియమించబడ్డారు.ఆమెకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు చూసుకునేవారు.

వారికి సంవత్సరంకు 30 వేల ఫౌండ్లను సదరు బిలియనీర్‌ ఖర్చు చేశాడు.

ఒక కూతురు కోసం ఇంతగా ఖర్చు చేసిన ఆ తండ్రి ఎవరు అనే విషయంపై ఈ వివరాలు వెళ్లడి చేసిన మీడియా సంస్థ క్లారిటీ ఇవ్వలేదు.కాని ఆమెకు ఆ తండ్రి ఇచ్చిన రాజబోగాల గురించి మాత్రం క్లీయర్‌గా చెప్పారు.ఆమె తండ్రి ఏర్పాటు చేసిన సిబ్బంది వల్ల పూర్తి కంఫర్ట్‌ ఫీల్‌ అవ్వలేదట.

విదేశాల్లో చదువు కోసం వెళ్లిన ఆ అమ్మాయి అక్కడ సాదారణ జీవితాన్ని గడపాలని భావిస్తే తండ్రి ఇలాంటి ఏర్పాట్లు చేయడం ఆమెకు కాస్త ఇబ్బంది అనిపించిందట.కాని ఆమె స్నేహితులు మాత్రం ఆమెలాంటి తండ్రి మాకు ఉంటే బాగుండేది కదా అనుకున్నారట.

మొత్తానికి ఆ అమ్మాయికి అలాంటి తండ్రి ఉండటం అదృష్టం అవ్వడంతో పాటు, అదే సమయంలో తాను అనుకున్న విధంగా జీవితాన్ని గడుపలేక పోవడం దురదృష్టకరం కూడా అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube