ఇంట్లో చెప్పులు ఎక్కడ విడ్చాలో తెలుసా... ఎక్కడ పడితే అక్కడ విడిస్తే దరిద్రం

ఇంట్లో నలుగురు ఉంటే ఆ నలుగురికి కనీసం రెండు జతల చొప్పున ఎనిమిది జతల చెప్పులు ఉంటాయి.ఆ చెప్పులు అన్ని కూడా ఇంటి ముందు వదిలేస్తూ ఉంటారు.

 Vastu Tips For Correct Placement Of Shoes In The House-TeluguStop.com

గుమ్మంకు ఎదురుగా చెప్పులు వదిలేయడం అనేది ఎంత మాంత్రం కరెక్ట్‌ కాదు.కొందరు గుమ్మంకు పక్కన చెప్పులు వదులుతారు.

గుమ్మం ముందు వదిలిన, గుమ్మంకు పక్కన చెప్పులు వదిలినా కూడా అరిష్టం అంటూ పండితులు చెబుతున్నారు.గుమ్మంకు కనీసం పది ఫీట్ల దూరంలో అయినా చెప్పులు వదలాలని లేదంటే గుమ్మంకు పక్కన ఏదైనా సెల్ఫ్‌లాంటిది ఉంటే అందులో ఉంచేసి డోర్‌ వేసుకోవడం మంచిది అంటున్నారు.

గుమ్మం ముందు చెప్పులు ఉండటం వల్ల ఇంట్లోకి నెగటివ్‌ ఎనర్జి వస్తుందంటారు.సహజంగా గుమ్మం ముందు తులసి కోట ఉంటుంది.ఆ తులసి కోటకు మరియు గుమ్మంకు మద్య చెప్పులు ఉండటం వల్ల తులసి కోట నుండి వచ్చే పాజిటివ్‌ ఎనర్జి కాస్త చెప్పుల వల్ల ఆగిపోతుందని చెప్పుబుతున్నారు.చెప్పులు వేసుకుని ఊరంతా తిరిగేసి వస్తూ ఉంటాం.

చెప్పులు ఎంత ఖరీదైనవి అయినా కూడా వాటితో ఎక్కడెక్కడో తిరుగుతాం కనుక వాటితో పాటు నెగటివ్‌ ఎనర్జి ఖచ్చితంగా ఉంటుందని, వాటిని ఇంట్లోకి తీసుకు రాకుండా ఎంత దూరంలో ఉంచితే అంత మంచిది అంటూ పండితులు చెబుతున్నారు.

ఇంట్లోకి చెప్పులు వేసుకుని వెళ్లూ ఉంటారు కొందరు.అలా ఇంట్లోకి చెప్పులు వేసుకుని వెళ్లడం అనేది దరిద్రం.ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు.

ఎక్కడెక్కడో తిరిగిన చెప్పులతో ఇంట్లోకి వెళ్లడం వల్ల ఇంట్లో ఉన్న దేవతలు బయటకు వెళ్తారనే టాక్‌ కూడా ఉంది.అందుకే ఇంట్లోకి చెప్పులు వేసుకోకుండా వెళ్లాలి.

చెప్పులు విడిచిన తర్వాత తప్పనిసరిగా కాళ్లు కడుకోవాలి.అలా చేస్తేనే ఇంట్లో సంతోషం, సంపద ఉంటాయని పండితులు, పెద్దలు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube