కోమాలో ఉన్న వ్యక్తి ముందు అలా చేయడంతో లేచి కూర్చుంది... వైధ్యులు కూడా నోరెళ్లబెట్టి మరీ చూశారు

సంగీతానికి బండరాళ్లు కరుగుతాయంటూ పాత సినిమాల్లో డైలాగ్స్‌ మనం ఎన్నో సార్లు విన్నాం.వినసొంపైన సంగీతం మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

 The Dengue Affected Coma Patient Recovered From Violin Music Sangeetha-TeluguStop.com

అదే సమయంలో వినసొంపైన సంగీతం ఎంతటి అనారోగ్యంను అయినా దూరం చేస్తుందని గతంలో కొన్ని సార్లు నిరూపితం అయ్యింది.సంగీతంకు మనిషిని చంపేంత శక్తి ఉందని, అదే సమయంలో చనిపోబోతున్న మనిషిని బతికించేంత శక్తి కూడా ఉందని మరోసారి నిరూపితం అయ్యింది.

ఈ సంఘటన జరిగింది మరెక్కడో కాదు, మన దేశంలోనే పశ్చిమ బెంగాళ్‌లో ఈ సంఘటన జరిగింది.

పశ్చిమ బెంగాల్‌ నైహతికి చెందిన సంగీత దాస్‌ అనే 21 ఏళ్ల యువత అక్టోబర్‌ 30న డెంగ్యూ వ్యాదితో హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యింది.నవంబర్‌ 3న ఆమెకు తీవ్ర అస్వస్థత చేసింది.దాంతో ఆమెను స్థానిక హాస్పిటల్‌ నుండి సీఎస్‌ఎస్‌కేఎం హాస్పిటల్‌కు తరలించారు.

అక్కడ చికిత్స అందుతున్న సమయంలోనే ఆమె కోమాలోకి వెళ్లి పోయింది.అప్పటి నుండి కూడా ఆమె కోమాలోనే ఉంది.

ఆమె బతకడం దాదాపు అసాధ్యం అంటూ వైధ్యులు కూడా నిర్థారించారు.ఎందుకంటే ఇదే లక్షణాలతో తమ కళ్ల ముందు 2011 లో ఒక రోగి మృతి చెందారని వైధ్యులు చెప్పారు.

వైధ్యుల మాటలకు సంగీత దాస్‌ కుటుంబం సభ్యులు నిరాశ చెందలేదు.ఎలాగైనా ఆమెను బతికించుకోవాలని ప్రయత్నించారు.ఆ సమయంలోనే వారు ఇంటర్నెట్‌ ద్వారా మ్యూజిక్‌ థెరపీని గురించి తెలుసుకున్నారు.వెంటనే వయోలిన్‌ ద్వారా ఆమెకు ప్రతి రోజు మ్యూజిక్‌ థెరపీ అందించడం మొదలు పెట్టారు.

ఆమె ముందు రోజులో గంట పాటు వయోలిన్‌ వాయించడం మొదలు పెట్టారు.మూడు రోజుల తర్వాత ఆమె పరిస్థితిలో మార్పు వచ్చింది.దాంతో దాన్ని కొనసాగించారు.22 రోజుల తర్వాత ఆమె కోమా నుండి పూర్తిగా బయటకు వచ్చింది.

సంగీతా దాస్‌ ఆరోగ్య పరిస్థితి చూసి వైధ్యులు కూడా అవాక్కయ్యారు.చనిపోతుందని చేతులు ఎత్తేసిన డాక్టర్లు ఆమె పరిస్థితిని చూసి నోరెళ్లబెట్టారు.సంగీత దాస్‌ నిజంగా అదృష్టవంతురాలు అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు.సంగీత దాస్‌ మాట్లాడుతూ.నన్ను మొదటి హాస్పిటల్‌లో చేర్పించడం మాత్రమే గుర్తు ఉంది, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏవీ కూడా నాకు గుర్తుకు లేవు అంటూ చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube