టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఫేమస్ యాంకర్ సుమ కలిశారు.హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు వచ్చిన సుమ కేటీఆర్ తో భేటీ అయ్యారు.అనంతరం ఆమె మీడియా మాట్లాడుతూ.‘ఓ మంచి పని కోసం కేటీఆర్ ని కలిశా.ఆ మంచి పని ఏంటి ? అన్నది మాత్రం ఇప్పడు చెప్పలేను.సమయం వచ్చినప్పుడు ఆ విషయం చెబుతా’ అన్నారు.
ఐతే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించినందుకు కేటీఆర్ కు అభినందనలు చెప్పానని మాత్రం తెలిపారు.
గురువారం హైదరాబాద్ లో జరిగిన రామ్ చరణ వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.ఈ వేడుకకి సుమ యాంకర్ గా వ్యవహరించారు.సార్ మిమ్మల్ని కలవాలని సుమ నిన్ననే కేటీఆర్ ని అడిగారట.ఆ మేరకు ఈ రోజు కేటీఆర్ తో ఆమె భేటీ అయ్యారు.అయితే… ఎందుకు కలిసారో అన్నది మాత్రం సస్పెన్స్ గానే మిగిలింది.