ఆ రాష్ట్రంలో ఎలుక మాంసం ఎంత రేటో తెలుసా...? డిమాండ్ తెలిస్తే నోరెళ్లబెడతారు !

ఎలుక అంటే ఆమ్మో అంటాము.ఇక ఎలుక మాంసం తినే వారి గురించి తెలిస్తే… ఛీ.

 Rat Meat For Rs 200 Per Kg At Assam-TeluguStop.com

ఛీ అంటాము .కానీ మనకు చేపలు.చికెన్ కి ఉన్నట్టే … మనదేశంలో ఓ రాష్ట్రంలో ఎలుక మాంసానికి కూడా బాగా డిమాండ్ ఉంది.అక్కడ కిలో ఎలుక మాంసం మనకు చికెన్ రేటు వలే … కేజీ 200 వరకు పలుకుతోంది.

అదెక్కడో కాదు మనదేశంలోని అస్సాం రాష్ట్రంలో ఉన్న బక్సా జిల్లాలోని కుమారికటా గ్రామస్తులు మాత్రం ఎలుక మాంసానికే అధిక ప్రాధాన్యమిస్తారు.ఆదివారం రాగానే ప్రజలంతాఅంటాము ఎలుక మాంసం కోసం క్యూ కడతారు.

బ్రాయిలర్ చికెన్‌తో సమానంగా ఎలుక మాంసం ధరలు ఉంటున్నాయంటే అక్కడ డిమాండు ఏ మేరకు ఉంది అనేది మీకే తెలుస్తుంది.గువహతీకి సుమారు 90 కిమీల దూరంలో ఉన్న ఇండియా-భూటాన్ సరిహద్దుల్లోని గ్రామాల్లో ప్రతి ఆదివారం తాజా ఎలుక మాంసాన్ని విక్రయిస్తారు.

వీటి కోసం అస్సాం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి తరలివస్తారు.

ఎలుక మాంసానికి ఉన్న గిరాకీ వల్ల అక్కడి రైతులు రెండు చేతులా సంపాదిస్తున్నారు.వీరు ఎలుకలను ఎందుకు తింటారనడానికి ప్రత్యేక కారణమైతే ఏదీ లేదు.ఎన్నాళ్ల నుంచో సాంప్రదాయకంగా వస్తున్న వంటకంగా ఎలుకలను ఆరగిస్తున్నారు.

ఎలుకలు రాత్రి వేళల్లో కన్నాల నుంచి బయటకు వస్తాయి.దీంతో రైతులు రాత్రి వేళ్లల్లో కర్రలతో నిర్మించిన బోనులను వ్యవసాయ క్షేత్రాల్లో పెడతారు.

బోనులో పడిన ఎలుకలను కొద్ది రోజులు పోషించి, ఆదివారం మార్కెట్లకు తరలిస్తారు.ఎలుకలను పట్టుకోవడం వల్ల ఆదాయమే కాకుండా తమ పంటలను రక్షించుకోగలుగుతున్నాం అని రైతులు చెబుతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube