టీఆర్ఎస్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ ! కాబోయే మంత్రులు వీళ్లేనా ...?

తెలంగాణాలో ఎన్నికల ఫలితాలు వచ్చి పదిహేను రోజులు దాటింది.అయితే కేసీఆర్ తో పాటు హోంమంత్రి గా మహిమూద్ అలీ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు.

 Cm Kcr May Expand Cabinet On December 28th-TeluguStop.com

ఇక అప్పటి నుంచి మంత్రి వర్గంలో తమకు ఎప్పుడు చోటు దక్కుతుందా అనే ఆశతో… చాలామంది ఎదురుచూపులు చూస్తున్నారు.అయితే కేసీఆర్ మాత్రం తొందరపడకుండా మంత్రి వర్గంలోకి తీసుకునే నాయకుల లిస్ట్ ను అనేక రకాలుగా వడబోసి మరీ… సెలెక్ట్ చేసే పనిలో బిజీ అయ్యాడు.అలాగే… ఈ నెలాఖర్లోనే మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కేసీఆర్ ఖరారు చేస్తారని జోరుగా చర్చ నడుస్తోంది.కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అయినా… ఇంకా ఎమ్యెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమమే ఇంకా పూర్తవ్వలేదు.

వారంతా ఎప్పుడెప్పుడు అసెంబ్లీ లో అడుగుపెట్టేద్దామా అని ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు.ఇక పార్టీలో మంత్రి పదవి దక్కడం ఖాయం అనుకున్న నాయకులు కూడా ఆశగా.మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.

టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఎవరికీ మంత్రి పదవి దక్కుతుందా అనే ఆతృతతో కూడిన సందేహం అందరిలోనూ కనిపిస్తోంది.ప్రస్తుతం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో 28నే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా లేదా అనేది చివరి నిమిషం వరకు సస్పెన్స్ గానే కనిపిస్తోంది.అయితే డిసెంబర్ దాటితే సంక్రాంతి పూర్తయ్యే వరకు మంచి ముహూర్తాలు లేకపోవడం వలన ఈ నెలాఖరునే కొత్త మంత్రి వర్గం ఏర్పడే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది.

ముహూర్తాలు తేదీల విషయాన్ని పక్కనపెడితే మంత్రి వర్గ కూర్పు ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పుడు పార్టీలో చర్చ జోరుగానే సాగుతోంది.అసెంబ్లీ సభ్యుల సంఖ్య ప్రకారం మంత్రుల సంఖ్య 18కి మించరాదు.

ఇప్పటికే సీఎం కేసీఆర్ మరో మంత్రి మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేసారు.ఇక మరో 16 మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉంది.

అయితే ఇప్పటికిప్పుడు అన్ని మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం కనిపించడం లేదు.ముఖ్యమైన కొన్ని మంత్రివర్గ స్థానాలను భర్తీ చేసి … మిగతా వాటిని రెండో విడతలో భర్తీ చేయాలనీ చూస్తున్నారు.

త్వరలో పంచాయితీ పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి.ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం పని చేసిన వారికే మంత్రి వర్గ విస్తరణలో ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.తొలివిడత జాబితాలో మొదటగా తనకు అత్యంత నమ్మకస్థులు… వీర విధేయులకు మాత్రమే చోటు కల్పించాలని కెసిఆర్ ఆలోచన.ఇక వీరిలో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి రేఖా నాయక్, నిజామాబాద్ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మెదక్ నుంచి హరీష్ రావు, కరీంనగర్ నుంచి ఈటెల రాజేందర్ , వరంగల్ నుంచి కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావులు మహబూబ్ నగర్ నుంచి నిరంజన్ రెడ్డి, నల్గొండ నుంచి జగదీశ్ రెడ్డి ఉండనున్నట్లు సమాచారం.

ఈ విడతలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రస్తుతానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube