టీడీపీకి జనసేనతో ఇబ్బంది తప్పదా ..? ఆ సమీకరణాలు మారుస్తారా...?

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్యే ప్రధానమైన పోటీ ఉంటుంది.ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి ఈసారి ఎన్నికల్లో అధికారం దక్కించుకుంటుంది అని అంతా డిసైడ్ అయ్యారు.

 Tdp Facing Problems With Janasena In 2019 Elections-TeluguStop.com

కానీ జనసేన పార్టీని అసలు ప్రధాన పోటీదారిగా… ఈ రెండు పార్టీలు గుర్తించలేదు.కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

జనసేన అనూహ్యంగా బలపడింది.చాపకింద నీరులా తన కార్యకలాపాలను విస్తరించుకుంది.

తాజాగా ఎన్నికల గుర్తు కూడా ఆ పార్టీకి ఈసీ కేటాయించింది.ఇక ఇప్పుడు ఈ రెండు పార్టీలకు వచ్చిన భయమంతా ఓట్ల చీలిక గురించే.ఎందుకంటే… జనసేన పార్టీ చీల్చే ఓట్లు ఫలితాలను తారుమారు చేస్తాయేమో అనే ఆందోళన ఈ రెండు పార్టీల్లో కనిపిస్తోంది.జనసేన ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంతంగా అధికారం దక్కించుకునే అంత స్థాయిలో లేకపోయినా… కొన్ని సామజిక వర్గాల ఓట్లను మాత్రం జనసేన ఖాతాలో వేసుకోగలదు.

ఇప్పుడు ఇదే భయం ప్రధానంగా టీడీపీ లో కనిపిస్తోంది.

గోదావరి జిల్లాల్లో కాపు సామజిక వర్గం చాలా వరకు పవన్ వెంటే అన్నది చాల వరకు డిసైడ్ అయిపొయింది.పవన్ కూడా ఎక్కువ ఈ రెండు జిల్లాలతో పాటు… ఉత్తరాంధ్ర జిల్లాల మీదే ఫోకస్ పెట్టాడు అని అంతా అనుకుంటున్న సమయంలో రాయలసీమలో పార్టీ బలంగా తయారవుతోంది.కొంతమంది చిన్నా చితక లీడర్లు… పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలుగుతున్నారు.

అయితే వారికి వాళ్లకు ఎమ్మెల్యేగా పోటీ చేసేంత స్థాయి లేకపోయినా.జనసేన తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులుగా పలువురు రెడీ అయ్యారు.

ఆ పార్టీ తరఫున వాళ్లు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రచారం పొందుతూ ఉన్నారు.నియోజకవర్గాల స్థాయిలో కాస్త బలం ఉన్న వాళ్లు, తాజా మాజీ ఎమ్మెల్యేలు.

ఇలాంటి వాళ్లంతా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లోనే ఉన్నారు.వారి అనుచరుల స్థాయి వాళ్లు మాత్రం జనసేనలోకి చేరి పోటీ అని అంటున్నారు.

ఇక కులాల లెక్కలు చూస్తే… రాయలసీమలో జనాభారీ రీత్యా ఫర్వాలేదనిపించుకునే స్థాయిలో ఉన్న బలిజలే జనసేనకు ప్రధాన ఓటు బ్యాంకు.వాళ్లే పవన్ కల్యాణ్ కు అండ.అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా… బలిజలు చాలా వరకూ ఆ పార్టీకే ఓటు వేశారు.ఇప్పుడు మళ్లీ ఆ ఓటు బ్యాంకు జనసేన వైపు చూస్తోంది.

గత ఎన్నికల్లో టీడీపీకి పవన్ మద్దతుగా నిలవడంతో … వారంతా తెలుగుదేశం పార్టీకి ఓటేశారు.కానీ ఇప్పుడు జనసేన నేరుగా రంగంలోకి దిగడంతో…వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓట్లకు జనసేన గండికొట్టే అవకాశం కనిపినిస్తోంది.

కానీ ఇక్కడ జనసేన అభ్యర్థులు గెలవకపోయినా… ఖచ్చితంగా టీడీపీకి నష్టం చేకూర్చి అంతిమంగా వైసీపీకి కలిసొచ్చేలా సమీకరణాలు మారుస్తారని భయం టీడీపీని వెంటాడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube