త్రిషతో బ్రేకప్‌కు కారణం చెప్పిన రానా

యంగ్‌హీరో రానా దగ్గుబాటి అగ్ర కథానాయిక త్రిషతో చాలాకాలంగా ప్రేమాయణం సాగించిన విషయం తెల్సిందే.ఈ ఇద్దరి ప్రేమ గురించి టాలీవుడ్‌ అంతా కూడా హాట్‌ చర్చలు జరుగుతూ ఉంటాయి.

 Koffee With Karan Rana Opens Up About His Break Up With Trisha-TeluguStop.com

చాలాకాలం ప్రేమించుకున్న త్రిష, రానాలు ఆ తర్వాత ఏమయిందో ఏమో బ్రేకప్‌ అయ్యారు.అయితే బ్రేకప్‌కు కారణం చెప్పే పరిస్థితి వీరికి ఇప్పటికి రాలేదు.

తాజాగా కాఫీ విత్‌ కరణ్‌ షోకు హాజరయిన రానాకు త్రిషతో బ్రేకప్‌ గురించి మాట్లాడాల్సి వచ్చింది.

ఈ షోలో భాగంగా త్రిషతో చాలా కాలం డేటింగ్‌ చేశావ్‌ కదా ఆ తర్వాత ఏమయింది? ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే ప్రశ్నలు ఎదురయ్యాయి.దాంతో ఈ ప్రశ్నలకు చాలా డిప్లమాటిక్‌ సమాధానం చెప్పాడు రానా.చాలాకాలం స్నేహంగా ఉన్నాం కదా అందుకే అంతా అలా అనుకున్నారు అని చెప్పుకొచ్చాడు.

ఇకపోతే సింగిల్‌ లైఫ్‌ చాలా బాగుంటుందని, పెళ్లి చేసుకుంటే లేని పోని కష్టాలు అని ఇంకా పెళ్లి చేసుకోలేదని చెప్పుకొచ్చాడు.

పెళ్లి చేసుకుంటే పెళ్లాంతో మాత్రమే ఉండాలి, ఫ్రెండ్స్‌తో ఎక్కువ ఎంజాయ్‌ చేయలేం కదా, నా స్నేహితులు చైతూ, చరణ్‌లు పెళ్లి చేసుకున్నారు.సో నేను సింగిల్‌ ప్రెండ్స్‌తో సర్దుకుపోతున్నాను, పెళ్లి చేసుకుంటే లేనిపోని భాద్యతలు కదా, అందుకే ఇలా సింగిల్‌గా లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్న అని రానా నవ్వుతూ పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube