అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ఊహించని షాక్ తగిలింది.అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాట్టిస్ గురువారం రాజీనామా చేస్తూ పెను సంచలనం సృష్టించారు.
ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ కి డెమోక్రాట్ల నుంచీ బలమైన షాక్ తగలడంతో ప్రజలు సైతం ట్రంప్ పాలనపై అమెరికన్స్ పెదవి విరిచినట్ట్టుగానే తెలుస్తోంది.ఈ క్రమంలోనే.
ట్రంప్ సిరియా నుండి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించడంపై ఏర్పడిన విబేధాల మూలంగా రక్షణ మంత్రి గా ఉన్న జేమ్స్ తన పదవికి రాజీనామా చేశారు.తన అభిప్రాయాలతో ఏకీభవించే వారికి రక్షణ శాఖ అప్పగించాలన్న ట్రంప్ భావిస్తున్నారని ఈ సందర్భంగా మాట్టిస్ తెలిపారు.
ఇదిలాఉంటే సిరియా నుండి సైన్యాన్ని ఉపసంహరించడం మంచిది కాదని పలువురు ట్రంప్ కి సూచనలు చేసిన సరే ట్రంప్ వారి మాటలని లెక్క చేయలేదు.దీంతో మాట్టిస్ రాజీనామా నిర్ణయం తీసుకోక తప్పలేదని అంటున్నారు సిరియాలో ఉగ్రవాదులపై యుద్ధం ఇంకా ముగియలేదంటూ కొన్ని నెలలుగా మాట్టిస్తో సహా పలువురు చెబుతున్నప్పటికీ ఐసిస్‌పై విజయం సాధించినట్లు ట్రంప్ ప్రకటించారు.