కస్తూరి ఆటాడేసుకుంటున్న స్టార్‌ హీరో ఫ్యాన్స్‌.. ఇంతకు ఆమె ఏమందంటే..!

తెలుగు మరియు తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన కస్తూరిపై గత కొన్ని రోజులుగా అజిత్‌ ఫ్యాన్స్‌ పెద్ద యుద్దమే చేస్తున్నారు.ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా మీడియా ముందుకు తీసుకు వచ్చి ఆమెను నానా రకాలుగా తల దించుకునేలా చేస్తున్నారు.

 Hero Ajith Fans Trolls On Actress Kasthuri-TeluguStop.com

ఆమెపై అజిత్‌ ఫ్యాన్స్‌ చేస్తున్న విమర్శలు పీక్స్‌కు చేరాయి.ఆమె ఆ హీరోతో సంబంధం, ఈ హీరోతో సంబంధం అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ వీడియోు, పోస్ట్‌లు సోషల్‌ మీడియాలో అజిత్‌ ఫ్యాన్స్‌ చేస్తున్నారు.

కస్తూరిపై అజిత్‌ ఫ్యాన్స్‌ ఇంతగా రెచ్చి పోవడానికి కారణం చాలా చిన్నది.కొన్ని రోజుల క్రితం కస్తూరి సోషల్‌ మీడియాలో అజిత్‌ ప్యాన్స్‌ గురించి కామెంట్‌ చేసింది.ఏంటీ అంటే అజిత్‌ ఫ్యాన్స్‌తో పెద్ద తలనొప్పి, వారు చిన్న విషయాన్ని కూడా పెద్దగా రియాక్ట్‌ అవుతారు అంటూ వ్యాఖ్యలు చేసింది.తలనొప్పి ఫ్యాన్స్‌, వారి గురించి అజిత్‌ అయినా కాస్త శ్రద్ద తీసుకుని, వారిని మంచి మార్గంలో పెడితే బాగుంటుందని అజిత్‌కు సలహా ఇచ్చింది.

దాంతో తీవ్రంగా రెచ్చి పోయిన అజిత్‌ ఫ్యాన్స్‌ ఆమెపై పై విధంగా పెద్ద ఎత్తున విరుచుకు పడుతున్నారు.

ఆమె బహిరంగంగా కనిపిస్తే దాడి చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు.మొత్తానికి ఆమె ఏ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటుందో ఈ సంఘటన ద్వారా తేలిపోయింది.అయితే కొందరు కస్తూరికి మద్దతుగా సోషల్‌ మీడియాలో నిుస్తున్నారు.

కస్తూరి ఆర్మీ అంటూ కొందరు ఆమెకు మద్దతుగా పోస్ట్‌లు చేస్తున్నారు.డర్టీ అజిత్‌ ప్యాన్స్‌ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌తో కస్తూరికి బాసటగా నిలుస్తున్న వారు కూడా భారీగా పెరుగుతున్నారు.

విజయ్‌ ఫ్యాన్స్‌ ఎక్కువ శాతం కస్తూరికి మద్దతు తెలుపుతున్నారు.మొత్తానికి ఈ విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube