7వ తరగతి మద్యలోనే వదిలేశాడు.. కాని అతడే ఇప్పుడు వందలాది మందికి కడుపు నింపుతున్నాడు.. గ్రేట్‌ రియల్‌ స్టోరీ

సంపాదనకు చదువుతో సంబంధం లేదు.ఎంతో మంది కనీసం చదువు రాని వారు కోట్లలో డబ్బు సంపాదించారనే విషయం తెల్సిందే.

 Thamas Sarts Nava Jeevan Trust In The Early Age Of 14-TeluguStop.com

డబ్బు సంపాదనకు కాస్త తెలివి ఉంటే చాలు అని ఎంతో మంది నిరూపించారు.ఇప్పుడు కేరళలో పీయూ థామస్‌ అనే వ్యక్తి సాయం చేసేందుకు డబ్బు చదువు అవసరం లేదని నిరూపించాడు.

థామస్‌ చదివింది 7వ తరగతి అయినా కూడా ఆయనలో సమాజ సేవ గురించి ప్రత్యేకమైన ఆలోచనలు మొలకెత్తాయి.అందుకే చిన్నతనంలోనే ప్రజలుకు ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు వచ్చాడు.

చదువుకు స్వస్థి చెప్పిన థామస్‌ ఆ తర్వాత ఎన్నో ఒడి దొడుకులు ఎదుర్కొన్నాడు.డబ్బు సంపాదించడం కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశాడు.వచ్చిన డబ్బులో ఎక్కువ శాతం సాయం చేసేందుకు ఉపయోగించాడు.

అంతటి మంచి మనిషి చేస్తున్న సాయంలో తాము భాగస్వాములం అవుతాం అంటూ కొందరు ముందుకు వచ్చారు.అలా కేరళలో నవజీవన్‌ ట్రస్ట్‌ ఏర్పాటు అయ్యింది.ప్రజలకు సేవ చేయాలనే గట్టి పట్టుదలతో ఉన్న థామస్‌కు నవజీవన్‌ ట్రస్ట్‌ ద్వారా మంచి డొనేషన్స్‌ రావడం జరిగింది.

దాంతో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం, సేవ చేయడం ప్రారంభించాడు.కొన్ని వందల మంది వేల మంది కూడా ఆయన సాయంను పొందారు.ప్రతి రోజు వందలాది మందికి భోజనం పెట్టడంతో పాటు, ఆర్థిక అవసరాలతో ఇబ్బంది పడే వారు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారిని ఆదుకుంటూ ఉంటాడు.

ఎంత సంపాదించిన కూడా రాని ఆనందం తనకు ఇలా సేవ చేయడం వల్ల వస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు.ప్రస్తుతం థామస్‌ ట్రస్ట్‌ ద్వారా కొన్ని వేల మంది సాయం పొందుతున్నారు.వారంతా కూడా థామస్‌ గొప్పదనం గురించి చెబుతూ ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube