బాలయ్య గురించి నాగబాబు అంత మాట అనేశాడేంటి.. అగ్గిమీద గుగ్గిలం అవుతున్న నందమూరి ఫ్యాన్స్‌

మెగా బ్రదర్‌ నాగబాబు కాస్త ఆవేశ పరుడు అనే విషయం అందరికి తెలిసిన విషయమే.ఆయన ఆమద్య వర్మ గురించి, అంతకు ముందు కొందరి గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంను రేపిన విషయం తెల్సిందే.

 Naga Babu Comment About Balakrishna Go Viral-TeluguStop.com

తాజాగా మరోసారి నాగబాబు తన నోటి దురుసుతో విమర్శల పాలు అవుతున్నాడు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగబాబు పలు సంచలన విషయాలను మాట్లాడాడు.

అందులో ప్రధానంగా బాలకృష్ణ గురించి నాగబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.నాగబాబు అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అంటూ కొందరు సినీ ప్రముఖులు కూడా అంటున్నారు.

రామ్‌ గోపాల్‌ వర్మ మరియు బాలయ్య బాబుల గురించి మీ అభిప్రాయం ఏంటీ అంటూ ప్రశ్నించిన సమయంలో రామ్‌ గోపాల్‌ వర్మ అనే పేరును ఎత్తడానికి కూడా చిరాకుగా ఉంది.అతడు తన కుటుంబం పట్ల వ్యవహరించిన తీరుతో ఒక వ్యక్తితో తన తమ్ముడిపై చేయించిన వ్యాఖ్యలతో అతడిని ఒక మనిషిగానే చూడటం లేదు అన్నాడు.ఇక బాలయ్య గురించి స్పందించమనగా తనకు బాలయ్య ఎవరో తెలియదు అన్నాడు.సీనియర్‌ నటుడు బాలయ్య మాత్రం తెలుసు.ఆయన గొప్ప నటుడు మంచి సినిమాలు చేశాడని మాత్రం చెప్పాడు.

బాలయ్య బాబు అంటే బాలకృష్ణ అంటూ యాంకర్‌ చెప్పేందుకు ప్రయత్నించగా ఆయన ఎవరో నాకు తెలియదు అంటూ తేల్చి చెప్పాడు.బాలయ్యపై నాగబాబు వ్యాఖ్యలు షాకింగ్‌గా ఉన్నాయి.నాగబాబుపై నందమూరి ఫ్యాన్స్‌ తీవ్రంగా రియాక్ట్‌ అవుతున్నారు.

నాగబాబు తాగి మాట్లాడినట్లుగా ఉన్నాడు అంటూ బాలయ్య ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube