ఆదర్శం : ఇంజనీర్‌ గా అప్పుడు యేడాదికి 6.5 లక్షల సంపాదన, కాని ఇప్పుడు 20 లక్షలకు పైగా సంపాదన

వ్యవసాయంకు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయనేందుకు కొందరు యువకులు చేస్తున్న కృషి సాక్ష్యంగా నిలుస్తుంది.లక్షల రూపాయలు జీతం వచ్చే ఉద్యోగాలను వదిలేసి వ్యవసాయం వైపు యువత మనసు పారేసుకోవడంతో రైతు అనే పదం కొనసాగే అవకాశం కనిపిస్తుంది.

 A Software Engineer As A Farmer He Now Earns 20 Lakh-TeluguStop.com

కొన్నాళ్ల వరకు వ్యవసాయం వల్ల నష్టాలే తప్ప లాభాలు ఉండవని అంతా భావించేవారు.ఎంత కష్టపడినా కూడా చివరకు ఫలితం వచ్చేది నమ్మకం తక్కువ అంటూ అంతా అనుకుంటారు.

కాని సరైన పద్దతిలో వ్యవసాయం చేస్తే తప్పకుండా లాభాలు వస్తాయని ఈతరం యువకులు నిరూపిస్తున్నారు.

మహారాష్ట్రకు చెందిన అనూప్‌ ఇంజనీరింగ్‌ చదివి మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు.

వారంలో అయిదు రోజులు కష్టపడితే చాలు మిగిలిన రెండు రోజులు రెస్ట్‌, సంవత్సరంకు ఆరున్నర లక్షల జీవితం.ఒక యువకుడికి ఇంతకంటే ఆనందమైన విషయం ఏం ఉంటుంది చెప్పండి.

నెలకు దాదాపుగా 60 వేల ఉద్యోంగం ఆయనకు సంతృప్తిని ఇవ్వలేదు.అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించాడు.అలా వ్యవసాయం వైపుకు వచ్చాడు.28 ఏళ్ల అనూప్‌ తనకున్న 12 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసేందుకు చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంను వదిలేశాడు.ఐటీ ఉద్యోగంను అనూప్‌ వదిలేసిన సమయంలో అంతా కూడా ఆయన్ను విమర్శించారు.నష్టాలు మిగిలే వ్యవసాయం చేసేందుకు లక్షల రూపాయల జీతం వచ్చే ఐటీ ఉద్యోగంను వదిలేయడం ఏంటని కొందరు కుటుంబ సభ్యులు తిటారు.

కాని అతడు మాత్రం నమ్మకంతో వ్యవసాయం మొదలు పెట్టాడు.

వ్యవసాయం చేసేందుకు సిద్దమయిన అనూప్‌ దాదాపు మూడు నెలల పాటు గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్రల్లోని పలు గ్రామాల్లో ఆదర్శ రైతులను కలుసుకున్నాడు.ఏ పంట ఏ సీజన్‌లో వేస్తే ఎంత లాభం అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు.మూడు నెలల పాటు ఒక నోట్స్‌ను తయారు చేసుకుని ఆ విధంగానే వ్యవసాయం మొదలు పెట్టాడు.

తనకున్న 12 ఎకరాలను కొన్ని విభాగాలుగా విభజించి లాభసాటి పంటలను వేయడం మొదలు పెట్టాడు.అప్పటి నుండి కూడా అనూప్‌కు మంచి లాభాలు వస్తున్నాయి.బంతితో పాటు పలు రకాల పూలు మరియు కూరగాల పండిస్తూ చుట్టు పక్కల వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.అనూప్‌ అన్ని ఖర్చులు పోను సంవత్సరంకు 20 లక్షలకు పైగా ఆదాయాన్ని పొందుతున్నాడు.

గతంలో ఒకరికింద ఉద్యోగం చేసిన అనూప్‌ ఇప్పుడు తన కింద దాదాపు 20 మందిని నియమించుకున్నాడు.

అనూప్‌ మాట్లాడుతూ.ఉద్యోగంతో మంచి లైఫ్‌ ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా ఉద్యోగిగానే మిగిలిపోవాలనుకోలేదు.ఐటీ ఉద్యోగం చేయడం వల్ల తాను ఎప్పటికి అలాగే ఉండాల్సి ఉంటుందని భావించాను.

అందుకే తన కుటుంబకు ఉన్న వ్యవసాయ భూమిని వినియోగించుకుని వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాను.యువత కాస్త శ్రద్దగా వ్యవసాయం చేస్తే మంచి లాభాలు వ్యవసాయంలో వస్తాయి.కూలీల కొరత నిజమే అయినా కూడా దాన్ని అధిగమిస్తే మాత్రం మంచి లాభాలు ఖాయం అన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube