యువ‌తీ యువ‌కులు ఒక‌ర్నొక‌రు ఎందుకు ప్రేమించుకుంటారు ? క‌రెక్ట్ ఆన్స‌ర్‌..!

నా బాయ్‌ఫ్రెండ్‌తో నేను ప్రేమ‌లో ప‌డిన‌ప్పుడు అత‌ని మ‌ద్యం సేవించే అల‌వాటు ఉండేది.అయితే నేను అత‌నికి ఆ అల‌వాటు మానుకోవాల‌ని చెప్పా.

 A Trule Love Between Men And Women-TeluguStop.com

దీంతో ఏమాత్రం వెనుకాడ‌కుండా నేను చెప్పిన‌దానికి అత‌ను ఓకే అన్నాడు.అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 8 సంవ‌త్స‌రాలు అవుతోంది.

కానీ ఇంత వ‌ర‌కు అత‌ను మ‌ళ్లీ మ‌ద్యం తీసుకోలేదు.కొద్ది రోజుల కింద‌ట మేమిద్ద‌రం ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్న‌ప్పుడు నేను అతన్ని ప‌లు ప్ర‌శ్న‌లు అడిగా.

నేను: మ‌ద్యం తాగడం ఎందుకు మానేశావు ?
అత‌ను: నీ కోస‌మే.

నేను: నీ ఫ్రెండ్స్ ఆల్క‌హాల్ తీసుకుంటున్న‌ప్పుడు నీకు తాగాల‌ని అనిపించ‌లేదా ?
అత‌ను: లేదు.

నేను: మ‌ద్యం వ‌ద్ద‌ని ఎందుకంత క‌ఠినంగా ఉంటున్నావు?
అత‌ను: తెలియ‌దు.

నేను: ఎందుకు ?
అత‌ను: నాకు తాగాల‌ని లేదు.

నేను: ఎందుకు ?
అత‌ను: ….

అలా నేను ఎందుకు అని చాలా సేపు అత‌న్ని అడిగా.

త‌రువాత కొంత సేప‌టికి అత‌ను నా జుట్టును స‌రిచేస్తూ అన్నాడు… మా నాన్నకు విప‌రీత‌మైన తాగుడు అల‌వాటు ఉండేది.అందువ‌ల్లే ఆయ‌న చ‌నిపోయారు.దీంతో కుటుంబ పోష‌ణ భారం అమ్మ‌పై ప‌డింది.ఒక భ‌ర్త లేకుండా భార్య‌కు కుటుంబాన్ని న‌డ‌పాలంటే ఎంత క‌ష్టంగా ఉంటుందో నాకు తెలిసింది.

నువ్వు చాలా అమాయ‌కురాలివి.నేను లేకుండా జీవించ‌లేవు.

ఎక్క‌డికీ వెళ్ల‌లేవు.ఒక వేళ నేను కూడా మా నాన్న లాగే తాగి చ‌నిపోతే.

అప్పుడు నువ్వు కూడా మా అమ్మ లాగే క‌ష్టాలు ప‌డాల్సి వ‌స్తుంది.క‌నుక‌నే.

నిన్ను ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌ని తాగుడు మానేశా.అన్నాడు.

అత‌ను అలా అనే స‌రికి నా క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి.నా ముఖం పింక్ క‌ల‌ర్‌లోకి మారింది.నాకు విప‌రీత‌మైన దుఃఖం వ‌చ్చేసింది.అప్పుడు నేనన్నా.ఐ ల‌వ్ యూ.అని.అందుకు అత‌ను నా క‌ళ్ల‌ను తుడుస్తూ.నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా.

పిచ్చిదానా.అన్నాడు.

నిజంగా నాకు అత‌నంటే చాలా పిచ్చి.ఇష్టం.

అత‌ను సాధార‌ణంగా చాలా త‌క్కువ‌గా మాట్లాడుతాడు.అంత త్వ‌ర‌గా త‌న మ‌నస్సులో ఉన్న భావాల‌ను బ‌య‌ట పెట్ట‌డు.

కానీ.ఆ రోజు అలా చెప్పే స‌రికి నాకు ప్రేమ‌పై ఒక అభిప్రాయం ఏర్ప‌డింది.

ప్రేమ అంటే.చాకొలెట్లు, గిఫ్ట్‌లు ఇచ్చుకోవ‌డం కాదు.

త‌మ‌కు ఇష్ట‌మైన దాన్ని ప్రేయ‌సి/ప్రియుడి కోసం త్యాగం చేయాలి.త‌మ‌కు ఇష్ట‌మైన వారితో ఉండేందుకు త‌మ‌కు ఇష్ట‌మైన వాటిని త్యాగం చేయాలి.

అదే ప‌రిపూర్ణ‌మైన ప్రేమ అనిపించుకుంటుంది.అందులో ఎలాంటి స్వార్థం ఉండ‌దు.

ష‌ర‌తులు ఉండ‌వు.!

– సానియా డిసౌజా

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube