రోబోకు కళ్లద్దాలు పెట్టడం వల్ల కోట్ల రూపాయలు మిగిలాయట.. ఎలాగో తెలుసా?

దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూసిన ‘2.ఓ’ చిత్రం నేడు విడుదల అయ్యింది.

 Srinivasan About Robot 2 Movie Graphics-TeluguStop.com

ఈ చిత్రంను దర్శకుడు శంకర్‌ ఏకంగా 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన విషయం తెల్సిందే.అద్బుతమైన టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

రోబో పాత్ర కోసం యానిమేషన్‌కు హాలీవుడ్‌ టెక్నాలజీని వాడారట.సినిమా నిర్మాణంలో అయిన ఖర్చులో ఎక్కువ శాతం గ్రాఫిక్స్‌ వర్క్‌కు ఖర్చు చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

అద్బుతమైన ఈ చిత్రం తప్పకుండా అందరు చూడాలంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు కోరుతున్నారు.

ఇక ఈ చిత్రం ప్రారంభం అయినప్పటి నుండి గ్రాఫిక్స్‌ గురించి మాట్లాడుతున్నారు.ఈ చిత్రానికి గ్రాఫిక్స్‌ అందించిన శ్రీనివాసన్‌ తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విఎఫ్‌ఎక్స్‌ గురించిన ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.ఈ చిత్రం కోసం కొన్ని వందల మంది నెలల తరబడి కష్టపడితే ఈ సినిమా పూర్తి అయ్యిందని, గ్రాఫిక్స్‌ వర్క్‌ కోసం ఎంతో కష్టపడ్డామని అన్నాడు.

ఇక రోబో పాత్రకు కళ్లద్దాలు పెట్టడం వెనుక బడ్జెట్‌ తగ్గించే ఉద్దేశ్యం అంటూ పేర్కొన్నాడు.రోబో కళ్లను మరియు కనుబొమ్మలను యానిమేట్‌ చేయడం అంటే అత్యంత ఖర్చుతో కూడుకున్నది.

అందుకోసం నిష్ణాతులైన యానిమేటర్స్‌ కావాల్సి ఉంటుంది.అందుకే రోబో కళ్లు మరియు కనుబొమ్ము కవర్‌ అయ్యేలా కళ్లద్దాలు పెట్టేశాం.

కళ్లు, కను రెప్పల వెంట్రుకలు యానిమేట్‌ చేయకుండా కళ్లజోడును సింపుల్‌గా యానిమేట్‌ చేసేయడం వల్ల చాలా పని తగ్గింది.దాంతో పాటు కోట్ల రూపాయల డబ్బు కూడా సేవ్‌ అయ్యిందని ఈ సందర్బంగా శ్రీనివాసన్‌ పేర్కొన్నాడు.ఇలా పలు విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకుని బడ్జెట్‌ను తగ్గించేందుకు విఎఫ్‌ఎక్స్‌ టీం పని చేసిందన్నాడు.ఇంత బడ్జెట్‌ పట్ల జాగ్రత్తలు తీసుకున్నా కూడా 600 కోట్లు అయ్యిందంటే సినిమాలో ఇంకా ఏముందో చూడాలి.

ప్రపంచ వ్యాక్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు వసూళ్లలో కొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube