నేను ఫ‌స్ట్ టైమ్ బైక్ న‌డిపిన‌ప్పుడు..బ‌రితెగించింది అన్నారు.! బ‌ట్ ఐ డొన్ట్ కేర్ అంటున్న ఓ మ‌హిళ స్టోరి.!

మా గ్రామంలో నేను మొద‌టిసారిగా మోటార్ సైకిల్‌ను న‌డుపుకుంటూ వ‌చ్చిన‌ప్పుడు అంద‌రూ న‌న్ను వింత‌గా చూశారు.అంద‌రూ నా చుట్టూ గుమిగూడారు.

 A Woman About Her Motorcycle Driving Story-TeluguStop.com

ఎందుకంటే.మా గ్రామంలో మోటార్ సైకిల్‌ను అప్ప‌టి వ‌ర‌కు మ‌హిళ‌లెవ‌రూ న‌డ‌ప‌లేదు.

అందుకే వారు అలా నా చుట్టూ చేరి నాపై కామెంట్లు చేయ‌డం మొదలు పెట్టారు.చూడండి.

ఆమె ఎంత‌కు బ‌రి తెగించిందో.ఏకంగా మోటార్ సైకిల్‌నే న‌డుపుతుంది.

అన్న‌ట్లు నేనేదో త‌ప్పు చేసిన దానిలా న‌న్ను దూషించ‌డం మొద‌లు పెట్టారు.అయినా నేను అవేమీ ప‌ట్టించుకోలేదు.

అయితే నా వ‌ల్లే ఆ గ్రామంలో మ‌హిళ‌లు మోటార్ సైకిల్‌ను నేర్చుకోవ‌డం, న‌డ‌ప‌డం ప్రారంభించారు.

నా పెళ్లికి ముందే నాకు మోటార్ సైకిల్ న‌డ‌ప‌డం వ‌చ్చు.నేను ప్ర‌స్తుతం ఓ అంత‌ర్జాతీయ స్వచ్ఛంద సంస్థ‌లో ప‌నిచేస్తున్నా.నా స్కూల్ రోజుల్లో నేను సైకిల్‌పై స్కూల్‌కు వెళ్లేదాన్ని.

నా భ‌ర్త‌కు నేనంటే చాలా ఇష్టం.ఎందుకంటే ఇత‌ర మ‌హిళ‌ల‌క‌న్నా నువ్వు చాలా డిఫ‌రెంట్‌.

అని ఆయ‌న నాతో చెబుతుంటారు.అందుకే నేనంటే ఆయ‌న‌కు చాలా ఇష్ట‌మ‌ట‌.

నా భ‌ర్త‌కు నిజానికి డ్రైవింగ్ రాదు.క‌నుక మోటార్ సైకిల్‌పై నా వెనుక‌నే కూర్చుంటాడు.

దాన్ని చూసి గ్రామ‌స్థులు మ‌మ్మ‌ల్ని హేళ‌న చేస్తుంటారు.అయితే అవేమీ ప‌ట్టించుకోవ‌ద్ద‌ని నా భ‌ర్త చెబుతుంటాడు.

మాకు ఇద్ద‌రు కూతుళ్లు.ఇద్ద‌రికీ నేనంటే చాలా ఇష్టం.నన్నే వారు ఆద‌ర్శంగా తీసుకుంటారు.పెద్ద కుమార్తె జ‌న్న‌త్‌కు 11 ఏళ్లు.

చిన్న కుమార్తెకు 5 ఏళ్లు.ఇద్ద‌రికీ సైకిల్స్ కొనిచ్చా.నేను కొద్ది కొద్దిగా దాచుకున్న సొమ్ముతో రూ.11వేలు ఖ‌ర్చు పెట్టి వారికి సైకిళ్ల‌ను కొన్నా.నా పెద్ద కుమార్తె సైకిల్‌పైనే స్కూల్‌కు వెళ్తుంది.నేను ఆమెకు ఎప్పుడూ చెబుతుంటా.పురుషుల‌తోపాటు స్త్రీల‌కు స‌మాన హ‌క్కులు ఉండాల‌ని.పురుషులు సైకిళ్ల‌ను తొక్కుతారు.

మోటార్ సైకిల్స్‌ను న‌డుపుతారు.అలాంటిది స్త్రీలు వారితో స‌మానంగా ఆ ప‌ని ఎందుకు చేయ‌కూడ‌దు.? అని నా కుమార్తెకు చెబుతుంటా.

ఎప్ప‌టికైనా నా కూతుళ్ల‌ను డాక్ట‌ర్ల‌ను చేయాల‌నేది నా క‌ల‌.అందుకోస‌మే నా జీతం కొంత కొంత పొదుపు చేస్తూ వారి కోసం కొంత స్థ‌లం కొన్నా.ఎప్ప‌టికైనా వారు డాక్ట‌ర్లు అయితే.

ఆ స్థ‌లంలోనే వారే సొంతంగా క్లినిక్ పెట్టుకోవాల‌నేది నా క‌ల‌.నా త‌ల్లికి 7 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే పెళ్లి చేశారు.

నేను పెరుగుతున్న‌ప్పుడు నా తల్లి స్కూల్‌కు వెళ్లేది.ఆమె 1వ త‌ర‌గ‌తి చ‌దివినప్ప‌టి నుంచి ఆమెతో రోజూ నేనూ స్కూల్‌కు వెళ్లేదాన్ని.8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకున్న అమ్మ త‌రువాత కొన్ని కార‌ణాల వ‌ల్ల‌ చ‌దువు మానేసింది.కానీ అమ్మ నాకు ఎప్పుడూ ఒక మాట చెబుతుండేది.

ల‌క్కీ.! నువ్వు నీ కాళ్ల‌పై నిల‌బ‌డి జీవించాలి.

ఎవ‌రిపై ఆధార ప‌డ‌కూడ‌దు.నీ అంత‌ట నువ్వు ఉద్యోగం సాధించి నీ క‌ల‌ల‌ను నువ్వే సాకారం చేసుకోవాల‌ని అంటుండేది.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube