అనాధలా పెరిగింది, అమెరికాలో కంపెనీ పెట్టింది.! ఇప్పుడు వెయ్యి మందిని చదివిస్తుంది! రియల్ స్టోరీ!!!

కన్న కూతురికి తిండి పెట్టలేక తండ్రి అనాథాశ్రమంలో చేర్పించాడు.ఫలితంగా అనాథాశ్రమంలో పెరగింది.

 Success Story Of Jyothi Reddy Founder Of Keys Software Solutions-TeluguStop.com

పదవ తరగతి దాకా చదువుకుంది.పదహారేళ్ళ వయసులో ఆ తండ్రి వచ్చి ఆ అమ్మాయి కన్నా పదేళ్ళు పెద్ద వయసులో ఉన్న ఒకరికి ఇచ్చి వివాహం చేశాడు.

రెండేళ్ళలో ఇద్దరు బిడ్డల తల్లి అయింది.కటిక పేదరికంలో మగ్గుతూ, కట్టుకున్న వాడికి, పిల్లలకూ తిండి పెట్టేందుకోసం ఎన్నో ఉద్యోగాల ప్రయత్నం చేసి విఫలమైనా… జ్యోతి రెడ్డి ఓడిపోలేదు చివరకు రోజుకు ఐదు రూపాయల కూలీకి పొలాల్లో పని చేసింది.

ఈ అన్ని పరిణామాలూ ఆ అమ్మాయిని నిరాశ, నిస్పృహలకు గురి చేయలేదు సరికదా మరింత దృఢంగా కష్టించేందుకు ప్రేరేపించాయి.ఫలితంగా ఇప్పుడు ఆమె అమెరికాలో కీ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇవో)గా పని చేస్తున్నది.

జ్యోతిరెడ్డి 1970లో భారతదేశంలోని ఒక పేద కుటుంబంలో జన్మించారు.ఇంట్లో చదివించడానికి స్తోమత లేనందున ఆమెకు మరియు ఆమె చెల్లిని ఓ సెమీ ఆర్ఫాన్ స్కూల్ జాయిన్ చేశారు.కొంతకాలం అచ్చటే ఉన్నాఅమె ఆ ఆర్ఫాన్ స్కూల్ లో ఉండలేక జ్యోతిరెడ్డి వాళ్ల చెల్లి ఇంటికి తిరిగి వెళ్లిపోయారు.ఎలాగోలా పదవతరగతి పూర్తి చేశారు.చదువుకుంటానని ఎంత మొత్తుకున్నా ఇంట్లో పెద్దోళ్లు వినలేదు.ఇంటర్మీడియెట్ జాయిన్ అయినా పట్టించుకోకుండా పెళ్ళి చేసేసారు.

ఇద్దరు పిల్లలు.ఉమ్మడి కుటుంబానికి తోడైన పేదరికం.

ఈ పరిస్థితుల్లో రోజూ వ్యవసాయం పనులకోసం పొలానికి వెళ్లడమే జ్యోతిరెడ్డి దినచర్య.సాయంకాలానికి ఇంటికి చేరి పిల్లలతో గడపడమే తెలుసు.

ఆ తర్వాత ఉమ్మడి కుటుంబం వేరుపడింది.

భర్త ఇంటి బాధ్యతలనుండి తప్పుకున్న కారణంగా ఆమె చంటి పిల్లలతో ఇంటి బాధ్యత ఎత్తుకోవలసి వచ్చింది.అప్పుడు నెహ్రూ యువ కేంద్ర అనే ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా దారి కనపడింది.ఆ సంస్థ పల్లెల్లో నైట్ స్కూళ్లు ఏర్పాటు చేసింది.

దాంట్లో టీచర్ గా అవకాశం వచ్చింది.అప్పుడు జ్యోతి రెడ్డి జీతం నెలకి 120 రూపాయలు.

ఆ తర్వాత అదే సంస్థలో ప్రమోషన్.ఉన్న ఊరు మారాల్సి వచ్చింది.

జ్యోతిరెడ్డి కుటుంబం హన్మకొండకు వెళ్లిపోవాల్సి వచ్చింది.కానీ ఈ మార్పు ఆమె భర్తకు నచ్చకుండానే జరిగింది.

హన్మకొండ నుంచి వేరు వేరు ఊళ్లకు ప్రయాణించడంలో తన జీవిత ప్రయాణం వెతుకున్నారు జ్యోతి.ఈ క్రమంలోనే అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ నుంచి 1994లో డిగ్రీ పూర్తి చేశారు.

కాకతీయ వర్సిటీ నుంచి 1997లో పోస్టు గ్రాడ్యుయేట్ పట్టా పొందారు.ఫలితంగా ఆమెకు రూ.398 వేతనంతో స్పెషల్ టీచర్ ఉద్యోగం వచ్చింది.బడికి వెళ్ళటానికి రోజూ రెండు గంటలు పట్టేది.

ఈ మధ్య సమయంలో తన తోటి ప్రయాణికులకు చీరెలు అమ్మి మరి కాస్త అదనపు డబ్బు సంపాదించేవారు.

అదే సమయంలో ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన ప్రకటన చూసిన జ్యోతి రెడ్డి జన శిక్షణ నిలయంలో లైబ్రేరియన్ గా ఉద్యోగం సంపాదించుకున్నారు.చదువును కొనసాగించటం కోసం ప్రతి ఆదివారం ఓపెన్ స్కూల్ కు హాజరయ్యేవారు.1992లో వరంగల్ కు 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న అమీన్ పేటలో పద్దెనిమిది మాసాల కాల పరిమితితో కూడిన స్పెషల్ టీచర్ ఉద్యోగం తనకు దక్కిందని, చివరకు 1994లో రూ.2,750 వేతనంతో పూర్తి స్థాయి ఉద్యోగం లభించిందని జ్యోతి రెడ్డి చెప్పారు.మరో నాలుగేళ్ళ తర్వాత అమెరికా నుంచి వచ్చిన తన భర్త బంధువును చూసి ఆశ్చర్య పోయింది.

అతడి హుందా, దర్జా చూసి తానూ అలా కావాలనుకున్నారు.అనుకున్నదే తడవుగా సాఫ్ట్ వేర్ నైపుణ్యం వైపు దృష్టి సారించారు.

అందుకోసం హైదరాబాద్లోని విసిఎల్ కంప్యూటర్స్ లో చేరి సాఫ్ట్ వేర్ శిక్షణ పొందారు.అందుకోసం దీర్ఘకాలిక సెలవు పెట్టారు.2000లో పాస్ పోర్టు, హెచ్1 వీసా లభించటంతో అమెరికా వెళ్ళారు.అక్కడ పని చేసే తన భర్త బంధువు సహాయంతో ఒక దుకాణంలో ఉద్యోగం సంపాదించి పన్నెండు గంటలకు 60 డాలర్ల వేతనం పొందారు.

అమెరికా వెళ్ళేందుకు వీలుగా తన ఇద్దరు పిల్లలనూ ఒక మిషనరీ స్కూల్లో చేర్చేశారు.అమెరికాలో ఒక గుజరాతీ కుటుంబానికి పేయింగ్ గెస్ట్ గా ఉన్నారు.

మెరికాలో ఒక క్యాసెట్ షాప్ లో సేల్ గాళ్ గా జాయిన్ అయ్యారు.రోజుకి 5 డాలర్ల ఉద్యోగం.అలా జ్యోతి అమెరికా కెరీర్ ప్రారంభమైంది.ఆ షాప్ కి వచ్చిన ఓ వరంగల్ ఎన్నారై ఆమెను చూసి మీరు టీచర్ కదా అని అడిగారు.మీరిక్కడ ఏం చేస్తున్నారు.మీ స్కిల్ కి ఇది తగిన ఉద్యోగం కాదని చెప్పేసి వెళ్లిపోయారు.

కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి జ్యోతిరెడ్డికి ఫోన్ చేసి రిక్రూటర్ ఉద్యోగం యిప్పించాడు.సాఫీగా సాగుతున్న ఉద్యోగం.

ఇంతలో 5 వేల డాలర్ల ఆఫర్ వచ్చింది.ఓ రిక్రూట్మెంట్ కంపెనీలో 50 శాతం షేర్ ఇస్తామన్నారు.

ఎలాంటి ఆలోచన చేయకుండా ఉద్యోగానికి రిజైన్ చేసి అక్కడకి వెళ్లిపోయారు.కానీ ఆ ఉద్యోగంలో చేరాక తెలిసింది.

ఆ కంపెనీ వాళ్లు లాభాల్లో యాభై శాతం అన్నారు.దీంతో డీల్ వర్కవుట్ కాలేదు.

అప్పటికి వర్జీనియాలో నెలకి 5వేల డాలర్ల ఉద్యోగం పోయి, ఇటు డీల్ జరక్క ఏం చేయాలో పాలుపోలేదట ఇక ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ఫలించలేదు.జీవితం చీకట్లోకి వెళ్లిపోయింది.

అన్నిటినీ తట్టుకుని ముందుకు సాగి అతి త్వరలోనే జ్యోతి రెడ్డి స్వంత సంస్థ (ఫీనిక్స్) స్థాపించుకోగలిగారు.అప్పటికే ఆమె పిల్లలు కూడా అమెరికా వచ్చేశారు.LKG నుంచి పిజి దాకా 1,000 మందికి చదువు చెప్పాలన్న తన డ్రీమ్ ప్రాజెక్టును సాకారం చేయటం ప్రారంభించారు.సాఫ్ట్ వేర్ శిక్షణ ఆ సంస్థ ప్రత్యేకం.

పుట్టిన రోజు నాడు వరంగల్లోని అనాథాశ్రమంలో ఆమె గడుపుతారు.మానసిక వికలాంగులైన పిల్లల ఆలనా పాలనా చూస్తారు.

ఈ క్రమంలో తన ఆలోచనా ధోరణితో LEARN TO LIVE FOUNDATION ను స్థాపించారు.అది విజయవంతంగా నడుస్తోంది.

ఇదీ మన తెలంగాణ బిడ్డ జ్యోతి రెడ్డి కథ.పూర్తి వివరాలను ఈ వెబ్ సైట్ లో పొందగలరు.www.jyothireddy.com

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube