కూటమి లో బాబు పెత్తనం చెల్లడం లేదా ...?

నేను అనుకున్నదే జరగాలి … నేను చెప్పిందే వేదం నేను చెప్తే తిరుగే ఉండదు అని ఇలా టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు అనుకుంటూ ఉంటాడు.బాబు ఆలోచన ఎప్పుడూ ఇలాగే ఉంటుంది.

 Mahakutami Naglated Chandrababu-TeluguStop.com

అయితే అది టీడీపీ వరకు వర్కవుట్ అవుతూ వస్తోంది.కానీ కొత్తగా తెలంగాణలో ఏర్పడిన మహాకూటమిలో మాత్రం చెల్లుబాటు అవ్వడం లేదు.

ఈ కూటమి ఏర్ఫడిన తొలినాళ్ళలో బాబు చెప్పిందే వేదం అన్నట్టుగా కూటమిలోని పార్టీలు వ్యవహరించాయి.అయితే.

బాబు పెత్తనం మరీ మితిమీరింది అనే బావనలోకి వచ్చిన పార్టీలు బాబు మాటను ఇప్పుడు పక్కనపెట్టేసి తమ మాటే చెల్లుబాటు అయ్యేలా వ్యవహరిస్తున్నాయి.పక్క పార్టీల్లో ఎవరెవరికి సీటు ఇవ్వాలనే విషయంలో కూడా బాబు వేలు పెడుతుండడంతో… ఆ పార్టీల నాయకులకు రుచించడం లేదు.

ముందుగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ అధిష్టానం కూడా మొత్తం బాధ్యత అంతా… బాబు మీదే పెట్టేసింది.కానీ ఇప్పుడు ఆ పప్పులేమీ ఉడకడం లేదు.ప్రత్యేకించి కొన్ని సీట్ల విషయంలో చంద్రబాబు వేసిన లెక్కలు వేరయితే.అభ్యర్థులు మాత్రం మరో రకంగా తెరమీదకు వచ్చారని స్పష్టం అవుతోంది.బాబు కొన్ని సీట్ల విషయంలో రాజకీయం చేయడానికి ప్రయత్నించాడు.అందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కమ్మ అభ్యర్థిని బరిలోకి దించాలని బాబు అనుకున్నాడు.

అక్కడ పీజేఆర్ తనయుడు విష్ణుకు టికెట్ వద్దని బాబు అన్నాడట.అందుకే తొలి జాబితాలో విష్ణుకు టికెట్ దక్కలేదు.

కానీ చివరకు ఏమైందో కానీ.మళ్లీ జాబితాలో విష్ణుకే టికెట్ ను ఖరారు చేసింది కాంగ్రెస్.

ఈ విధంగానే… ఎల్బీనగర్ సీటు విషయంలో కూడా చంద్రబాబు మాటను కూడా కాంగ్రెస్ పక్కన పెట్టేసింది.అక్కడ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి టికెట్ వద్దు అని చంద్రబాబు నాయుడు సూచించాడు.కానీ.చివరకు కాంగ్రెస్ సుధీర్ రెడ్డికే టికెట్ ఇచ్చేసింది.వాస్తవంగా అయితే అక్కడ బాబు చెప్పుచేతల్ల్లో ఉండే వ్యక్తిని సెలెక్ట్ చేద్దామనుకున్నారు.కానీ కాంగ్రెస్ ముందే జాగ్రత్త పడడంతో బాబు మాట చెల్లుబాటు కాలేదు.

కానీ సనత్ నగర్ సీటు విషయంలో మాత్రం బాబు రాజకీయం నెగ్గిందని అంటున్నారు.అక్కడ నుంచి కూన వెంకటేష్ గౌడ్ బాబు ఆశీస్సులతో పోటీ చేస్తున్నాడు.

సీనియర్ నేత శశిధర్ రెడ్డిని పక్కన పెట్టి సైతం కాంగ్రెస్ అధిష్టానం బాబు మాట మేరకు కూనకు టికెట్ ఇచ్చింది.ఇక మిగతా చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సెలెక్ట్ చేసిన అభ్యర్థుల విషయంలో అడ్డుపుల్ల వెయ్యాలనుకున్నా … కాంగ్రెస్ బాబు మాయాజాలంలో ఇరుక్కోకుండా … ముందే జాగ్రత్త పడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube