అమెరికాలో అమ్మచేతి వంటని రుచి చూపించడం కోసం.ఎన్నో భారతీయ సాంప్రదాయ రుచులని అందించే హోటల్స్ వెలిశాయి.
కానీ అక్కడ హోటల్స్ లో గోదావరి సంస్థ హోటల్స్ కి మంచి గుర్తింపు ఉంది.అచ్చం ఇంట్లో చేసుకునే వంటల మాదిరిగా.
గోదావరి రుచులని అందించడంతో ఆ హోటల్ కి పెట్టింది పేరు.
ఈ హోటల్ కి పన్నీర్ అని పేరు పెట్టారు.మాల్ తరహలో ఈ హోటల్ ని నిర్వహిస్తున్నారు…అన్ని హోటల్స్ కంటే కూడా ఎంతో భిన్నంగా ఉంటుంది ఈ హోటల్ అంతేకాదు మాల్స్ కి వచ్చే వినియోగదారులని దృష్టిలో పెట్టుకుని వంటకాలు సిద్దం చేస్తున్నారట.
అయితే ఈ తరహా మాల్స్ ని మొదటి సారిగా ఇక్కడ ప్రారంభించామని ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి మాల్స్ ని ఏర్పాటు చేస్తామని గోదావరి సంస్థల వ్యవస్థాపకుడు కోగంటి కౌషిక్ తెలిపారు.
.తాజా వార్తలు