ఆ స్కూల్ పిల్లలకు ఆ హెడ్ మాస్టర్ ఎలాంటి శిక్ష వేశాడో తెలుసా..? పిల్లల నోట్లోంచి పుగలు వచ్చేశాయ్ !

స్కూల్ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే సాధారణంగా టీచర్లు బెత్తంతో కొట్టడమో లేక గుంజీలు తీయించడమో , లేక క్లాస్ లో నిలబెట్టడమే చేస్తుంటారు.ఇది సర్వ సాధారణంగా అన్ని స్కూళ్లల్లో విద్యర్థులకు వేసే శిక్ష.

 Teacher Forces Students Smokem Punishment-TeluguStop.com

అయితే ప్రాధమిక పాఠశాలలో చదువుతున్న పిల్లలచేత సిగరెట్ తాగించాడు ఓ ప్రధాన ఉపాధ్యాయుడు.పదకొండు మంది విద్యార్థులకు శిక్ష వేసేందుకు వారిచేత బలవంతంగా సిగరెట్ తాగించాలని నిర్ణయించాడు.

ఆటస్థలంలో 11 మంది విద్యార్థులను లైన్‌గా నుంచోబెట్టారు.ఆ తర్వాత వారిని హెడ్‌మాస్టర్ గదికి లాక్కెళ్లారు.అక్కడ పనిష్మెంటుగా వారిని సిగరెట్ తాగమన్నారు.వారు సిగరెట్ తాగుతుంటే వారిని చూసి పక్కనేఉన్న కొంతమంది ఇతర విద్యార్థులు నవ్వుతున్నారు.ఈ సంఘటన ఇండోనేషియాలోని ఉత్తర జావ ప్రాంతంలోని ఓ పాఠశాలలో చోటుచేసుకొంది.

ఆ హెడ్ మాస్టర్ పేరు తాటి మాలేటీగా గుర్తించారు.పిల్లలు సిగరెట్ తాగుతూ గుప్పుగుప్పున పొగవదులుతుంటే అక్కడే ఉన్న ఒక టీచర్ వీడియో చిత్రీకరించాడు.ఈ వింత శిక్షకు సంబంధించన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పిల్లల తల్లిదండ్రులు హెడ్‌మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube