పిచ్చి పుకార్లు ఆపండ్రోయ్‌ : వర్మ

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అత్యంత వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.ఈ చిత్రం కోసం చంద్రబాబు నాయుడు పాత్రకు నటుడు దొరికేశాడు.

 Rupali Suri Is Actres As Laxmi Parvathi In Laxmis Ntr Rgv-TeluguStop.com

ఎన్టీఆర్‌ పాత్ర కోసం మంచి వ్యక్తి కోసం వర్మ వెదికే పనిలో ఉన్నాడు.ఇప్పటికే ఎన్టీఆర్‌ వంటి వ్యక్తి ఉంటే నాకు చెప్పండి అంటూ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటన చేయడం జరిగింది.

తాజాగా వర్మ ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్ర కోసం మంచి నటిని ఎంపిక చేసే పనిలో ఉన్నాడు.

ఇటీవల రామ్‌ గోపాల్‌ వర్మ తన సోషల్‌ మీడియా పేజ్‌ లో రూపాలి అనే యువతి ఫొటోలను షేర్‌ చేయడం జరిగింది.ఆమె లక్ష్మీ పార్వతి యంగ్‌ ఏజ్‌లో ఎలా ఉండేదో అచ్చు అలాగే ఉంది.సోషల్‌ మీడియాలో వర్మ ఆ ఫొటోలను పోస్ట్‌ చేసిన కారణంగా అంతా కూడా వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రను రూపాలి చేసే అవకాశం ఉందని భావించారు.

కాని వర్మ ఆ వార్తలను కొట్టి పారేస్తున్నాడు.

మీడియాలో రూపాలి గురించి వస్తున్న వార్తలపై వర్మ స్పందిస్తూ మీ పిచ్చి పుకార్లను ఆపండ్రా బాబోయ్‌.రూపాలి మా నిర్మాతల్లో ఒకరికి తెలిసిన వ్యక్తి.అంతే తప్ప ఈ చిత్రంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.

రూపాలి ఫొటోలు పోస్ట్‌ చేసినంత మాత్రాన ఆమెకు సినిమాకు సంబంధం ఉందని ఎలా భావిస్తారు అంటూ వర్మ ప్రశ్నించాడు.మరో వైపు ఇప్పటికే ప్రారంభం కావాల్సిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఇంకా సెట్స్‌ పైకి వెళ్లలేదని తెలుస్తోంది.

త్వరలోనే పూర్తి క్లారిటీతో వర్మ అన్ని విషయాలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube