ఆ టాలెంట్ తో... సైకిల్ తో అమెరికాకు

కష్టపడే తత్వం … వినితనమైన ఆలోచనలు ఉండాలి కానీ ప్రతిభకు తగిన గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని నిరూపించాడు … కృష్ణా జిల్లా తోట్లవల్లూరు గ్రామానికి చెందిన కంభంపాటి నాగశ్రీపవన్‌.అతడు పేదలు, సామాన్యుల కోసం ఖర్చు లేకుండా ప్రయాణించే ఆటోమేటిక్‌ చార్జి సైకిల్‌ను రూపొందించాడు.

 A Young Man Going To America To Find An Automated Charging Bicycle-TeluguStop.com

కంచికచర్ల సమీపంలోని దేవినేని వెంకటరమణ, హిమశేఖర్‌ మిక్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.కళాశాల మెకానికల్‌ యాజమాన్యం, అధ్యాపక బృందం, ఏపీ స్కిల్‌ డవలప్‌మెంట్‌ సహకారంతో ఈ వినూత్న సైకిల్‌ను రూపొందించినట్లు నాగశ్రీపవన్‌ తెలియజేశాడు.

ఏపీ స్కిల్‌ డవలప్‌మెంట్‌ ద్వారా నాగశ్రీపవన్‌కు అమెరికాలోని బోస్టన్‌ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది.నాగశ్రీపన్ రూపొందించిన ఆటోమేటిక్‌ చార్జి సైకిల్‌ గురించి వివరించటానికి ఈ నెల 4 నుంచి 16వ తేదీ మధ్యలో సైకిల్‌తో సహా రావాలని నాగశ్రీపవన్‌కు యూనివర్సిటీ పిలుపునిచ్చింది.దీంతో పవన్‌ శనివారం సాయంత్రం కుటుంబసభ్యులు, బంధువుల వీడ్కోలు నడుమ అమెరికా పయనమయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube