మోడీ కి బాబు చుక్కలు చూపించనున్నారా..??

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌య్యారు.ఏపీకి జ‌రుగుతున్న అన్యాయం, త‌న ప్ర‌భుత్వంపై జ‌రుగుతున్న కుట్ర రాజ‌కీయాలు, కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కం గా ఏపీపై చూపుతున్న వివ‌క్ష‌.

 Chandrababu Targets Pm Modi1-TeluguStop.com

వంటి వాటిపై గ‌త కొన్నాళ్లుగా చంద్ర‌బాబు యుద్ధం చేస్తున్న విష‌యం తెలిసిందే.అయితే, ఇప్పుడు ఈ ఉద్య‌మానికి కూడా కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం స్పందించ‌డం లేదు.

దీంతో బాబు ఏకంగా త‌న‌కు జ‌రుగు తున్న అన్యాయంపై దేశం మొత్తం క‌లియ‌దిరిగి ప్ర‌చారం చేయాల‌ని బాబు నిర్ణ‌యించుకోవ‌డం గ‌మ‌నార్హం.దీంతో బీజేపీకి ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ఇక‌, చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

దేశంలోని ఇతర రాష్ట్రాల్లో తెలుగువారి సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ధర్మ పోరాట సభలు నిర్వహించాలని బాబు నిశ్చయించారు.కర్ణాటకలో తెలుగువారు ఎక్కువగా ఉన్నారని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్య‌తిరేకంగా ఓటేయాలంటూ.చంద్ర‌బాబు ఇచ్చిన‌ పిలుపు మేరకు బీజేపీకి వ్యతిరేకంగా వారు ఓటేయ‌డం తెలిసిందే.దీంతో కేవ‌లం స్వ‌ల్ప తేడాతోనే అక్క‌డ బీజేపీ అదికారానికి దూర‌మైంది.ఇక‌, తమిళనాడులో కూడా తెలుగువాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నందున చెన్నైలో ఒక ధర్మపోరాట బహిరంగ సభ పెట్టాలని అనుకుంటున్నారు.సీబీఐ, ఈడీల నుంచి ఐటీ శాఖల వరకు ప్రతి వ్యవస్థను మోడీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తున్న తీరు గురించి ఢిల్లీ వెళ్లి పలు పార్టీల నేతలకు వినిపించిన చంద్రబాబు.

ఇదే అంశంపై కలిసొచ్చే ఇతర నాయకులతోను మాట్లాడాలని భావిస్తున్నారు.

బీఎస్పీ అధినేత్రి మాయావతి నుంచి ఫరూక్‌ అబ్దుల్లా, శరద్‌యాదవ్‌, కేజ్రీవాల్‌, సీపీఐ అగ్రనేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, రాజా వరకు అందరినీ ఢిల్లీలో కలిశారు.దీనికి కొనసాగింపుగా జరుగుతున్న పరిణామాలు, కుట్రలపై టీఎంసీ నాయకురాలు, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో కూడా చంద్రబాబు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు.బెంగాల్లో కూడా కేంద్ర కక్షపూరిత వ్యవహారాలకు వ్యతిరేకంగా బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తున్నారు.

తొలుత జనవరిలో ఈ సభను నిర్వహించాలనుకున్నా.కేంద్ర వైఖరిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముందుగానే జరిపితే బాగుంటుందని చంద్రబాబు ప్రతిపాదించినట్లు సమాచారం.

ఇదే గ‌నుక కార్య‌రూపం దాలిస్తే.చంద్ర‌బాబుకు అన్ని హంగులూ క‌లిసి వ‌స్తే.

బీజేపీకి, మోడీకి మూడిన‌ట్టేన‌ని అంటున్నారు.మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube