ఆ... వాహన యజమానులకు చేదువార్త ! నిషేధం విధించిన సుప్రీం కోర్ట్

దేశ రాజధాని ఢిల్లీ లో మోతాదుకు మించి కాలుష్యం పెరిగిపోవడంతో .దాని తీవ్రతను తగ్గించేందుకు సర్వోన్నత న్యాయస్ధానం చొరవ తీసుకుంది.

 Supreme Court Banned Long Time Use Vehicals-TeluguStop.com

జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో 15 ఏళ్ల కిందటి పెట్రోల్‌ వాహనాలు, పదేళ్ల కిందటి డీజిల్‌ వాహనాల రాకపోకలను నిషేదించింది.రాజధాని రోడ్లపై ఈ వాహనాలు తిరిగితే స్వాధీనం చేసుకోవాలని రవాణా శాఖను సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఢిల్లీలో ప్రస్తుత కాలుష్య తీవ్రతకు ఈ నిర్ణయం అనివార్యమని కోర్టు స్పష్టం చేసింది.కాలుష్య నియంత్రణ మం‍డలి, రవాణా శాఖ వెబ్‌సైట్‌లలో ఈ వాహనాల జాబితాను ప్రకటించాలని పేర్కొంది.పౌరులు కాలుష్యంపై ఫిర్యాదు చేసేందుకు అనుగుణంగా కాలుష్య నియంత్రణ మండలి తక్షణమే సోషల్‌ మీడియలో ఖాతాను అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది.గతంలో దేశ రాజధానిలో పాత వాహనాల రాకపోకలను నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సైతం నిషేధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube