‘దేవదాస్‌’ ఫైనల్‌ కలెక్షన్స్‌.. బాగానే రాబట్టారే

నాగార్జున, నాని కలిసి నటించిన మల్టీస్టారర్‌ చిత్రం ‘దేవదాస్‌’ భారీ అంచనాల నడుమ గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రం అన్ని ఏరియాలకు కలిపి 35 కోట్లకు అమ్ముడు పోయింది.

 Devadas Movie Final Collections-TeluguStop.com

నాని, నాగార్జున కెరీర్‌లో ఇది భారీ బిజినెస్‌ అని చెప్పుకోవాలి.మల్టీస్టారర్‌ చిత్రం కనుక సునాయాసంగా 35 కోట్ల షేర్‌ను దక్కించుకుంటుందని అంతా అనుకున్నారు.

కాని అనూహ్యంగా ఈ చిత్రం ఆకట్టుకోలేక పోయింది.ఏమాత్రం మెప్పించలేక మొదటి రోజే ఫ్లాప్‌ టాక్‌ ను దక్కించుకుంది.

ఫ్లాప్‌ టాక్‌ కారణంగా సినిమా 35 కోట్లలో కనీసం సగం అయినా వసూళ్లు చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.పోటీకి పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో పాటు, మల్టీస్టారర్‌ చిత్రం అనే ఆసక్తితో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆధరించారు.దాంతో ఈ చిత్రం 26 కోట్ల వరకు నెట్టుకు రాగలిగింది.అంటే 9 కోట్ల లాస్‌తో ఈ చిత్రం క్లోజ్‌ అయ్యింది.నిర్మాతలు ఇంతకు మించిన లాస్‌ను అనుకున్నారు.కాని అదృష్టం బాగుండి తక్కువ లాస్‌తోనే బయట పడ్డారు.

ఏరియాల వారిగా ఈ చిత్రం ఫుల్‌ రన్‌ కలెక్షన్స్‌ :
నైజాం – 7.12 కోట్లు
సీడెడ్ – 2.83 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.70 కోట్లు
ఈస్ట్ – 1.37 కోట్లు
వెస్ట్ – 1.09 కోట్లు
కృష్ణ – 1.60 కోట్లు
గుంటూరు – 1.71 కోట్లు
నెల్లూరు – 0.78 కోట్లు
టోటల్(ఏపీ + తెలంగాణా) – రూ.19.20 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 2.80 కోట్లు
ఓవర్సీస్ – 3.72 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ షేర్

– రూ.25.72 కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube