ఇంట్లో మరుగుదొడ్డి లేని వారికి ఆ గ్రామంలో కూరగాయలు అమ్మరు,క్షవరం చేయరు.ఎక్కడో తెలుసా

అవును మీరు విన్నది నిజమే.ఇంట్లో మరుగుదొడ్డి లేనివారికి అక్కడ వ్యాపారులు కూరగాయలు అమ్మరు.

 The Village Debars The People Who Cant Have Latrine Rooms In The Home1-TeluguStop.com

బార్బర్లు క్షవరం చేయరు.ఇంతకీ అది ఏ ఊరో తెలుసా.

మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో ఉన్న భుతేదా గ్రామం.మొన్నీ మధ్య మనం ఒక గుడి గురించి చెప్పుకున్నాం గుర్తుందా ? ప్రసాదంగా బంగారం,నోట్ల కట్టలు పంచే గుడి అని.ఆ గుడి ఉన్న జిల్లాలోనే ఈ గ్రామం కూడా ఉంది.ఇంతకీ ఆ గ్రామస్థులు ఆ నిర్ణయం ఎందుకు తీస్కున్నారో తెలుసా?

ఇల్లు, పరిసరాలు తద్వారా సమాజాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పరిశుభ్రతకు మారు పేరుగా మన దేశం నిలవాలని ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే.అయితే పైన పేర్కొన్న భుతేదా గ్రామవాసులు ఇప్పుడదే స్వచ్ఛ భారత్ నినాదంతో ముందుకు వెళ్తున్నారు.తమ గ్రామంలో బహిరంగ మల విసర్జనను పూర్తిగా నిర్మూలించాలని కంకణం కట్టుకున్నారు.

అయితే ఈ ఆలోచనకు ముందుగా రూపమిచ్చింది భుతేదా గ్రామానికి చెందిన స్థానికుడు లోకేష్ శర్మ.

స్వచ్ఛ భారత్ అభియాన్‌పై జరిగిన ఓ అవగాహన కార్యక్రమానికి హాజరైన లోకేష్ శర్మ తన గ్రామాన్ని కూడా ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకున్నాడు.ఈ నేపథ్యంలో బహిరంగ మల విసర్జనను నిర్మూలించేందుకు ఓ కొత్త ప్రాజెక్టుతో ముందుకు వచ్చాడు.దీంతో అతను తన గ్రామంలో పరిశుభ్రతకు శ్రీకారం చుట్టాడు.

అతని సలహా ప్రకారం ధీరూభాయ్ అనే ఓ కూరగాయల వ్యాపారి మరుగుదొడ్లు లేని వారికి కూరగాయలను అమ్మనని తీర్మానించుకున్నాడు.అతనికి పలువురు గ్రామస్తుల నుంచి మద్దతు కూడా లభించింది.

దీంతో కొందరు అప్పటికప్పుడే మరుగుదొడ్డి కట్టి వాడాలని నిర్ణయించుకున్నారు.

కాగా ధీరూభాయ్ వ్యూహాన్నే మరో బార్బర్ కూడా అనుసరించాడు.అమారు లాల్ సేన్ అనే బార్బర్ మరుగుదొడ్లు లేని వారికి క్షవరం చేయనని తెలియజేశాడు.దీంతో మరికొందరు బహిరంగ మలవిసర్జనకు స్వస్తి చెప్పారు.

అయితే మరుగుదొడ్లు కట్టడం వెంటనే ప్రారంభించిన వారు తన దుకాణానికి మొదటి సారి వస్తే వారికి అమారు లాల్ సేన్ ఒకసారి ఉచితంగా క్షవరం చేసేవాడు.బహిరంగ మల విసర్జన వల్ల కలిగే అనారోగ్య ఫలితాలు, వాతావరణ ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే తాము ఈ చర్యలకు పూనుకున్నామని థీరూభాయ్, అమారు లాల్ సేన్‌లు చెబుతున్నారు.భుతేదా గ్రామ సర్పంచ్ భారత్ మాలవ్యా మాట్లాడుతూ తమ ప్రాజెక్టులో భాగంగా అనేక మంది గ్రామస్తులకు బహిరంగ మల విసర్జన గురించిన చెడు ప్రభావాలపై అవగాహన కల్పిస్తున్నామని అంటున్నారు.

4 Attachments

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube