జనసేనుడి కొంపముంచుతున్న అభిమానులు

ఏపీ రాజకీయాల్లో అధికార టిడిపి , ప్రతిపక్ష వైసిపి ఈ రెండు పార్టీలు కీలకంగా ఉన్న తరుణంలో కేవలం అతి తక్కువ సమయంలోనే ఏపీలో రెండు ప్రధాన పార్టీల కి ప్రత్యామ్నాయంగా ఒక బలమైన పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ జనసేన పార్టీ.పవన్ కళ్యాణ్ ని ఏర్పాటు చేసిన ఈ పార్టీ అనతి కాలంలో భారీ స్థాయిలో గుర్తింపు పొందడానికి గల ఏకైక కారణం కేవలం పవన్ కళ్యాణ్ కి అంతులేని అభిమాన సంద్రం అని చెప్పడంలో సందేహం లేదు.

 Netizens Miss Using Pawan Kalyans Name In The Social Media-TeluguStop.com

కేవలం అభిమానుల కారణంగానే ఏపీలో జనసేన పార్టీ పుంజుకుంది.క్లుప్తంగా చెప్పాలంటే అభిమానులు లేనిదే జనసేనుడు లేడు జనసేన పార్టీ లేదు.

అయితే ఇప్పుడు ఇదే అభిమానం పవన్ కళ్యాణ్ కొంప ముంచుతోంది జనసైనికులు జన సైనికుడు ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు అంటే అవుననే సమాధానం వస్తోంది.వివరాల్లోకి వెళ్తే…

పార్టీ నిలబెట్టిన అభిమానులే ఇప్పుడు పార్టీని పాతాళం లోకి నెట్టేసే పరిస్థితికి వచ్చారు.జనసేన కార్యకర్తలు చాలామంది యువకులే కావడం, వారికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా ఉండటంతో మితిమీరిన ఉత్సాహం వారిని హద్దులు దాటే ల చేస్తోంది.అభిమానులను నియంత్రించే బలమైన నాయకులు నియోజకవర్గాల వారీగా కానీ మండల స్థాయిలో కానీ లేకపోవడం వలన అభిమానుల ఆగడాలకి పద్దుపద్దు లేకుండా పోతోంది… ఇప్పుడు ఆ నియంత్రణ లేని జనసేన పార్టీకి భారీ నష్టాన్ని తెచ్చిపెడుతోంది.

జనసేన సైనికులుగా పిలవబడుతున్న అభిమానులు నెట్టింట్లో అవలంబిస్తున్న తీరు ఆమోదయోగ్యంగా ఉండకపోవటం కుర్ర చేష్టలని పెంచడం జనసేనకు అతిపెద్ద మైనస్ అవుతోంది దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛను ఎవరు అడ్డుకునే ప్రసక్తి లేదు కానీ మితిమీరిన భావ ప్రకటన ఆయా వ్యక్తులకు గాని ఆ ప్రకటనలు చేస్తున్న వ్యక్తులకు పార్టీలకు గాని తీవ్ర నష్టాన్ని మాత్రం కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు…ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై పొరుగు పార్టీల మహిళా నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ వ్యాఖ్యలకు దీటుగా జనసేన పార్టీ తరపున మహిళా నేతలు లేదా పార్టీలో కీలక వ్యక్తులు దీటుగా సమాధానం ఇస్తున్నారు కానీ…

పవన్ కళ్యాణ్ అభిమానులైన జనసైనికులు అత్యుత్సాహంతో సదరు మహిళా నేతల పై చేస్తున్న విమర్శలు అత్యంత హేయంగా ఉండటం జనసేన పార్టీకి నష్టం కలిగిస్తుందని వేరే చెప్పనక్కర్లేదు.జనసైనికులు సోషల్ మీడియాలో ఆ మహిళా నేతలని బూతులు తిడుతూ పెడుతున్న పోస్టులు జనసేన పార్టీ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి, కానీ ఈ విషయాన్ని జనసేన పార్టీ ప్రస్తుతానికి తేలికగా తీసుకుంటున్నా భవిష్యత్తులో జనసేన కి ఇవే పరిస్థితులు పెద్ద ముప్పు తెచ్చిపెడతాయని పార్టీ పార్టీపై పవన్ కళ్యాణ్ పై ఉన్న మంచి అభిప్రాయాన్ని చివరి క్షణాల్లో దూరం చేసుకోవాల్సి వస్తుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube