మరో కొత్త ఉద్యమం ! మీకు మీటూ .. మాకు మెన్ టూ

సినీ పరిశ్రమలోనే కాక దాదాపు అన్ని రంగాల్లోను ‘మీ టూ’ ఉద్యమం కాక పుట్టిస్తున్న సమయంలో మరో సరికొత్త ఉద్యమం పుట్టుకొచ్చింది.తమిళ పరిశ్రమలోని ఓ దర్శకుడు ఈ ఉద్యమన్ని ప్రారంభించారు.

 Men Too Movement Started At Bangloor-TeluguStop.com

‘మీటూ’ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మహిళలు బెదిరింపులకు పాల్పడుతున్నారని.దీని బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ‘మీ టూ మెన్’ ఉద్యమాన్ని ప్రారంభించినట్టు తమిళ సినీ దర్శకుడు వారాహి తెలిపారు.

ఇప్పుడు ఇటువంటి తరహా ఉద్యమమే మరోటి పురుడు పోసుకుంది.అయితే, ఇది పురుషుల చేతిలో అన్యాయానికి గురైన మహిళలకు సంబంధించినది కాదు.మహిళల చేతిలో కష్టాలు పడుతున్న పురుషులకు సంబంధించింది.దీనిపేరు ‘మెన్ టూ’.బెంగళూరు కేంద్రంగా పనిచేసే ‘క్రిస్ప్’ అనే స్పచ్ఛంద సంస్థ దీనిని తెరపైకి తీసుకొచ్చింది.ఈ సంస్థ నిర్వాహకుడైన కుమార్ జాగిర్దార్.

మరో 15 మందితో కలిసి ఆదివారం దీనిని ప్రారంభించారు.‘మీటూ’కు ‘మెన్ టూ’ ఏమాత్రం వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా జాగిర్దార్ పేర్కొన్నారు.

తప్పుడు కేసులు, ఆరోపణలతో మానసిక క్షోభ అనుభవిస్తున్న పురుషుల ఆవేదనను వెలికి తీసుకొచ్చేందుకే దీనిని ప్రారంభించినట్టు వివరించారు.

అకౌంటెంట్ అయిన జాగిర్దార్… స్టాక్ మార్కెట్ నిపుణుడు కూడా.భార్యా బాధితుల సంఘం, భారతీయ కుటుంబ సంక్షేమ సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన గృహ హింస, లైంగిక వేధింపుల చట్టాలలో సవరణలు చేయాలంటూ గత 15 ఏళ్లుగా పోరాడుతున్నారు.ఆయనను వదిలి కుమార్తెతో కలిసి వెళ్లిపోయిన భార్య ఓ క్రికెటర్‌ను పెళ్లాడింది.

తన కుమార్తె సంరక్షణ భారాన్ని తనకు అప్పగించాలంటూ పోరాడి విజయం సాధించారు.కాగా, ‘మెన్ టూ’ వ్యవస్థాపకుల్లో ఫ్రాన్స్ మాజీ రాయబారి పాస్కల్ మజురియర్ ఉండడం విశేషం.సొంత కుమార్తెనే లైంగికంగా వేధించాడంటూ పాస్కల్‌పై ఆయన భార్య కేసు పెట్టింది.2017లో కేసును కొట్టేసిన కోర్టు పాస్కల్‌ను నిర్దోషిగా విడుదల చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube