పవన్ ఆ మాటతో ... 'శ్రీమంతుడు' కాబోతున్న రాంచరణ్

‘తిత్లీ’ తుపాను ప్రభావం వల్ల శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోయింది.అక్కడి ప్రజలను ఆదుకోవడానికి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు.

 Pavan Is Going To Adopt A Village In The Srikakulam Area Ramcharan-TeluguStop.com

తమవంతు సహాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందించారు.ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు, పవన్‌ కల్యాణ్ శ్రీకాకుళంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.

అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

ఈ క్రమంలో రామ్‌చరణ్‌కు .పవన్‌ ఓ మంచి సలహా ఇచ్చారు.జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోమని కోరారట.ఈ విషయాన్ని చరణ్‌ ప్రకటన ద్వారా తెలిపారు.‘తుపాను బాధితుల పరామర్శ నిమిత్తం కల్యాణ్‌ బాబాయ్‌ శ్రీకాకుళం, విజయనగరంలో పర్యటించినప్పుడు.నష్టపోయిన ఓ గ్రామాన్ని దత్తత తీసుకోమని నాకు సలహా ఇచ్చారు.బాబాయ్‌ ఈ సూచన ఇవ్వడం నాకు చాలా సంతోషంగా అనిపించింది.బాబాయ్‌ సలహా పాటించాలని నిర్ణయించుకున్నా.గ్రామం దత్తత విషయమై నా బృందంతో చర్చించా.

ఏ గ్రామం దత్తత తీసుకోవాలో నా బృందం గుర్తిస్తుంది.ఏ గ్రామాన్ని దత్తత తీసుకున్నానో త్వరలో ప్రకటిస్తా’ అని చరణ్‌ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube