చంద్రబాబు చీప్ పాలి 'ట్రిక్స్' ఇదే నిదర్సనం..

రాజకీయాల్లో తిమ్మిని బిమ్మి చేయడం.బిమ్మిని తిమ్మి చేయడం ఏదన్నా సాధ్యమేనని ఎన్నో సందర్భాలలో రుజువయ్యింది.

 Cm Chandrababu Naidu Cheap Tricks About Case In Karnataka-TeluguStop.com

అవుతూనే ఉంటుంది.ఇది అందరికి తెలిసిన విషయమే అయితే అంతటి చీప్ ట్రిక్స్ చేయడం కూడా ఓ గొప్పేనండోయ్.

అంటున్నారు విశ్లేషకులు అయితే ఈ విద్యలో ఆరితేరిన ఏకైక వ్యక్తి దేశంలోనే సీనియర్ మోస్ట్ లీడర్స్ లో వేళ్ళ మీద లెక్క పెట్టుకునే వ్యక్తి కేవలం చంద్రబాబు ఒక్కడే అంటున్నారు.పరిస్థితులని తనకి అనుగుణంగా మార్చుకోవడంలో బాబోయ్ బాబు మామూలోడు కాదు అంటూ సెటైరికల్ గా బాబు గురించి కోకొల్లలుగా చెప్తారు సీనియర్ విశ్లేషకులు.ఇదిలాఉంటే

గతంలో ఎంతటి రాజకీయలు చేసినా సరే మారుతున్న పరిస్థితులకి రాజకీయాల్లోకి వస్తున్నా కొంగొత్త ప్రవాహానికి ఇప్పటి పరిస్థితులకి బాబు రాజకీయం చూస్తుంటే ఈసడించుకుంటున్నారు.తన అనుభవానికి తగ్గట్టుగా కాకుండా మరింతగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు రాష్ట్రంలో తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.కేంద్రంలోని నరేంద్ర మోడీతో జతకట్టడం.ఇద్దరు కలిసి టీడీపీ పై కక్ష సాధింపులు చేస్తున్నారు అంటూ దుయ్యబట్టడం, కుట్ర రాజకీయాలు చే్స్తున్నారని విమర్శించడం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ప్లాన్ వేయడం ఇప్పుడు బాబు చేస్తున్న చీప్ ట్రిక్స్.

ఇందుకు నిదర్సానమే తాజాగా జరిగిన రెండు ఘటనలు.

మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు చంద్రబాబు సహా పలువురుకికోర్టుకు హాజరుకావాలని నాన్ బెయిల్ వారెంట్లు జారీ చేసిన విషయం అందరికి విదితమే అయితే…ఈ వార్త వచ్చిన తరువాత ఆ నోటీసులు మాకు అందలేదని బాబు స్పష్టం చేశారు.

అయితే ఈ తరుణంలో ఈ విషయాన్ని తమ రాజకీయ స్వార్ధానికి అనుకూలంగా వాడుకోవడానికి

మోడీ కనుసన్నల్లోనే ధర్మాబాద్ కోర్టు పనిచేస్తున్నదన్న రీతిలో పెద్ద ఎత్తున ఆరోపణలు పుట్టించారు.దానికి తగ్గట్టుగా బాబు భజన మీడియా సైతం ఇదే వార్తలని ప్రచారం చేసింది కూడా.

అయితే ఈ కేసులో కోర్టు హాజరు నుంచీ చంద్రబాబు కి మినహాయింపు కావాలని స్టే తెచ్చుకున్నారు దాంతో కోర్టు ఇష్యూ మరుగునపడింది

మోడీ కావాలని చేసుకుంటే ఈ పాటికి ఆ విషయంలోనే అరెస్టులు జరిగి ఉండేవి పైగా బాబు బయటకి కూడా రాకుండా చేయడం మోడీ కి పెద్ద విషయం కూడా కాదు.ఇదిలాఉంటే మరొక విషయం ఏమిటంటే.

ఏపీలో కొందరు వ్యాపారవేత్తలపై.రాజకీయాలని అడ్డుపెట్టుకుని వ్యాపారాలు నడుపుతున్న వారిపై ఐటీ దాడులు చేసిన విషయం విదితమే అయితే ఈ దాడులని సైతం బాబు రాజకీయంగా వాడేసుకుంటున్నారు.అంతేకాదు బీజేపీని, జగన్‌, పవన్ కళ్యాణ్ ని ఎకేయాలని కూడా చంద్రబాబు తమ నేతలకి చెప్పారు.అంతేకాదు ప్రజలని ఐటీ దాడుల నుంచీ డైవెర్ట్ చేయడానికి ప్రత్యేక హోదా అడిగితే.

ప్రశ్నిస్తే.రాష్ట్రాన్ని ఐటీ దాడులతో భయపెట్టాలని కేంద్రం చూస్తోందని విరుచుకుపడ్డారు.

నిజానికి ఐటీ వారికి వచ్చిన సమాచారం మేరకు దాడులు జరుగుతాయి అయితే ఈ అంశంలో కూడా శవాలపై చిల్లర ఏరుకునే విధంగా బాబు ప్రయతిస్తున్నారని ఇప్పటికే ప్రతిపక్షం దుమ్మెత్తి పోస్తోంది.ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బాబు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడంతో బాబు రాజకీయం చేయడం కోసం మరీ ఇంతగా దిగజారాలా.

ఇన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేయాలా అంటూ పెదవి విరుస్తున్నారు ఏపీ ప్రజలు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube