టికెట్ల కోసం నాయకుల కుప్పిగంతులు !

ప్రస్తుతం ప్రజల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది.? మళ్ళీ అధికారం చేపట్టే అవకాశం ఉందా .? నియోజకవరంలో ఏ పార్టీకి ఎక్కువ అనుకూలత ఉంది.? టికెట్ తమకు వచ్చే అవకాశం ఉందా .? లేక మరొకరికి వస్తుందా .? ఒక వేళ టికెట్ రాకపోతే పక్క పార్టీలో కి జంప్ చేస్తే.అక్కడైనా అవకాశం ఉంటుందా .? ఒకవేళ అవకాశం లేకపోతే… ఉన్న పార్టీ నుంచే రెబెల్ గా రంగంలోకి దిగితే ఫలితం ఎలా ఉంటుంది ఇలా అనేక అనేక రకాల ప్రశ్నలతో ఇప్పుడు నియోజకవర్గ స్థాయి నాయకులు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.ఏళ్ల తరబడి పార్టీలను నమ్ముకున్న నేతలు కొందరు ఈ సారి ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.అందుకోసమే ఇటువంటి అనేక ప్రశ్నలను తమకు తామే వేసుకుంటున్నారు.

 Jumping Japangs In All The Parties-TeluguStop.com

గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎలాగైనా టికెట్‌ సాధించుకోవాలని ఆశిస్తున్నారు.ఒకవేళ టికెట్‌ రాకపోతే రెబల్‌గానైనా బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారు.ఇప్పటి నుంచే కాలనీలు, బస్తీల్లో సొంత పలుకుబడి పెంచుకునేందుకు తప్పిస్తున్నారు.కొంత మందైతే తమకు టికెట్టు నిరాకరించిన పార్టీని ఓడించేందుకైనా రెబల్‌గా దిగుతామని బహిరంగంగానే చెబుతున్నారు.పెడుతున్న ఖర్చు వివరాలు అధిష్ఠానానికి తెలిసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

టికెట్‌ రాని వారు రెబెల్‌గా దిగితే ఓటమి ప్రమాదం పొంచి ఉందని అభ్యర్థులు భయపడుతున్నారు.అసమ్మతిదారులను దారికి తెచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.అసమ్మతి కార్పొరేటర్లను ఇప్పటికే చాలా వరకూ శాంతపరిచారు.

అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నచ్చచెబుతున్నారు.అయితే నామినేషన్‌ తేదీ లోపు ఏమైనా జరగొచ్చనే అనుమానాలు అభ్యర్థులను వెంటాడుతున్నాయి.

పార్టీలలో సీనియర్లను కలిసి బయోడేటాను అందచేస్తున్నారు.బస్తీలో విస్తృతంగా పర్యటిస్తూ ఫొటోలు తీసి వీటిని టికెట్‌ ఇచ్చే కమిటీకి పంపిస్తున్నారు.

నాయకులతో సామాజిక వెబ్‌సైట్‌ల ద్వారా టచ్‌లో ఉంటున్నారు.మరో వైపు పార్టీ కాదంటే గోడదూకేందుకు ఇతర పార్టీల నాయకులతో టచ్ లో ఉంటూ తమకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube