తెలంగాణ డిప్యూటీ సీఎం అభ్యర్థిగా కోదండరాం ..?

ప్రజాకూటమి ( మహాకూటమి) లో ఉన్న పార్టీల మధ్య సరైన సయోధ్య కుదరడంలేదు.సీట్ల లెక్క తేలడం లేదు… ఇక బెదిరంపులు.

 Telangana Deputy Cm Candidate Is Kodandaram From Pajakutami-TeluguStop.com

అలకలు అయితే అంతే లేదు.ఈ నేపథ్యంలో కూటమిలో కీలకంగా ఉన్న టీజేఎస్ అధ్యక్షుడు కాంగ్రెస్ కి భారీ డిమాండ్లు పెట్టారు.

డెడ్ లైన్ విధించి మరీ బెదిరించారు.ఒకదశలో ఆయన కూటమి నుంచి బయటకి వచ్చేందుకు కూడా సిద్ధం అయ్యారు.

అదే సమయంలో ఆయన బీజేపీ కి మద్దతు పలుకుతారని వార్తలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ అలెర్ట్ అయ్యింది.ఆయన్ని బుజ్జగించి దారిలోకి తెచ్చుకునేందుకు సిద్ధం అయ్యింది.

తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవిని టీజేఎస్ చీఫ్ కోదండరామ్‌కు కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశంలో చర్చించారు.అయితే ఈ విషయమై టీజేఎస్ చీఫ్ కోదండరామ్ స్పందించలేదు.కానీ, ఈ ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహరమని టీజేఎస్ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం ఆధివారం హైద్రాబాద్‌లో జరిగింది.ఈ సమావేశంలో రాహుల్ గాంధీ సభల ఏర్పాట్లు, మహాకూటమిలోని పార్టీలతో సీట్ల సర్ధుబాటు విషయమై ప్రదానంగా చర్చించారు.

మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు బాధ్యతను మాజీ మంత్రి జానారెడ్డికి అప్పగించారు.అయితే ఇదే సమయంలో టీజేఎస్ గురించి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మహాకూటమికి మెజార్టీ స్థానాలు దక్కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే టీజేఎస్ చీఫ్ కోదండరామ్‌కు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలనే ప్రతిపాదన కూడ ఈ సమావేశంలో వచ్చినట్టు తెలుస్తోంది.ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు తుది నిర్ణయాన్ని తీసుకోలేదు.

మరోవైపు టీజేఎస్‌కు ఎన్నికల గుర్తు ఇంకా ఎన్నికల సంఘం కేటాయించలేదు.ఈ తరుణంలో టీజేఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తుపై పోటీ చేయించే విషయమై కూడ ఈ సమావేశంలో చర్చించారు.టీజేఎస్ అభ్యర్థులైనా… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తుపై పోటీ చేసి విజయం సాధిస్తే సాంకేతికంగా వారంతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అవుతారు.ఒకవేళ ఇందుకు టీజేఎస్ ఒప్పుకొంటే రాజకీయంగా కాంగ్రెస్‌కు ప్రయోజనమే.

కానీ, టీజేఎస్‌కు మాత్రం లాభం ఉండదనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.మ

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube