ప్చ్ ... తూర్పులో టీడీపీ కష్టమే ! ఇంటిలిజెన్స్ రిపోర్ట్ !

ఏపీలో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చిన గోదావరి జిల్లాల్లో ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది.పార్టీకి కంచుకోటలుగా నిలబడిన ఆ జిల్లాలో ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.

 Tdp Win Is Not Impossible In East Godavari-TeluguStop.com

ప్రభుత్వ వ్యతిరేకత.జగన్ పాదయాత్ర.

జనసేన ఊపు … టీడీపీ నాయకుల అవినీతి అక్రమాలు … ఇలా ప్రతి విషయంలోనూ టీడీపీకి మైనెస్ లే ఎక్కువ కనిపిస్తున్నాయి.కంచుకోటలనుకున్న ఈ జిల్లాలో టీడీపీ గాలి ఇతర పార్టీలకు మళ్లడం చంద్రబాబు లో వణుకు తెప్పిస్తోంది.2019 లో అధికారం దక్కించుకోవడం ఖాయం అనుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఎదురుగాలి కలవరపెడుతోంది.ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని తాజాగా ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడంతో ఈ కలవరం మరింత పెరిగింది.

అసలు ఇప్పటికే అనేక సర్వేల ఫలితాలు టీడీపీకీ వ్యతిరేకంగా వచ్చిన సంగతి తెలసిందే.వైసీపీ అధికారంలోకి వస్తుందని చాలా సర్వేలు తేల్చేశాయి.ప్రధానంగా అక్కడి నేతల వ్యవహారశైలిపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందంట.ఈసారి ఎన్నికల్లో పార్టీ మెజారిటీ స్థానాలు దక్కించుకోవడం కష్టమని సాక్షాత్తు ఇంటెలిజెన్స్ అధికారులు సమర్పించిన నివేదికలు చెబుతున్నాయి.

తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ నేతలను కట్టడి చేయకుంటే తీవ్ర నష్టం తప్పదని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదికను అందించాయి.

గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అండతో బీజేపీ,టీడీపీ కలిసి ఎన్నికల బరిలోకి వెళ్లాయి.19 నియోజక వర్గాల్లో 16 సీట్లను గెలుచుకున్నాయి.కానీ ఈ సారి మాత్రం అటువంటి ఛాన్స్ లేదని ప్రభుత్వం చేయించిన సర్వేలో తేలిపోయింది.

అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు కొందరు ఆర్థిక లావాదేవీలే కాకుండా సెటిల్ మెంట్లలో తలదూర్చి పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారని, ఈ వ్యవహారాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని రిపోర్ట్స్ అందాయి.ప్రస్తుతం ఉన్న సగం మంది ఎమ్యెల్యేలకు సీటు దక్కడం కష్టమేనని వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి టీడీపీ ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి ఆ పార్టీ కంచుకోటలకు బీటలు పెట్టేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube