టి. కాంగ్రెస్ మొదటి లిస్ట్ రెడీ ! ఆ 30 మంది అభ్యర్థులు వీరే ..?

తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ఒక్కటైనా పార్టీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.అయితే ఈ కూటమిలోని పార్టీలు సీట్ల దగ్గర పేచీలు జరుగుతుండడంతో ఇంకా సీట్ల పంపకం వ్యవహారం ఒక స్పష్టమైన కొలిక్కి రాలేదు.

 Telangana Congress Released First List Of Candidates-TeluguStop.com

అయితే ఈ సమయంలోనే కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముప్పై మందితో కూడిన ఒక లిస్ట్ ప్రకటించింది.ఈ లిస్ట్ లో ఉన్న అభ్యర్థుల విషయంలో కూటమి నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడుతోంది.

కానీ కొన్ని సెటిలర్స్ నియోజకవర్గాల్లో అయితే సీట్ల సర్దుబాటు సవాల్ గా మారింది.

కూకట్ పల్లి నుంచి మహాకూటమి తరుపున తానే బరిలో ఉంటానని అంటున్నారు టీడీపీ నేత పెద్దిరెడ్డి.మరోవైపు సెటిలర్స్ కోటాలో కూకట్ పల్లి నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు కాంగ్రెస్ నేత ఏలూరి రామచంద్రారెడ్డి.ఈ వ్యవహారం మరో పది రోజులు ఉండేట్టుగా కనిపిస్తోంది.

మరోవైపు శేరిలింగంపల్లి , ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది.ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అయితే మెజారిటీ నేతలు క్యామ మల్లేశ్‌కు అవకాశమివ్వాలని డిమాండ్ చేస్తుండగా.

ఆయనతోపాటు కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నారు.అలాగే పరకాల అసెంబ్లీ స్థానానికి మాజీ మంత్రి కొండా సురేఖ పేరును దాదాపు ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతున్నా.

అక్కడ మరో నేత వెంకట్రామిరెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నారు.

అలాగే కరీంనగర్‌ అసెంబ్లీ స్థానానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పేరుతోపాటు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద పేరునూ పరిశీలిస్తున్నారు.

పొన్నం ప్రభాకర్ పేరును దాదాపు ఫిక్స్ చేసింది అధిష్టానం.కాంగ్రెస్ అభిమానినంటూ ఇటీవల పార్టీలో చేరిన సినీ నిర్మాత బండ్ల గణేష్ తనకు షాద్ నగర్ కాకుండా జూబిలీహిల్స్ టికెట్ కావాలని అడుగుతున్నారు.

కానీ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కాదని టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు.ఇక కాంగ్రెస్ పార్టీలోని ఈ కింద ఉన్న ముప్పై మంది నేతలు మహాకూటమి నుండి పోటీ చేయడం ఖాయం అని తెలుస్తోంది.

ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హజూర్‌నగర్‌), కె.జానారెడ్డి (నాగార్జున సాగర్‌), మల్లు భట్టి విక్రమార్క (మధిర), దామోదర రాజనర్సింహ (అందోల్‌), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్లగొండ), సంపత్‌కుమార్‌ (అలంపూర్‌), వంశీచందర్‌రెడ్డి (కల్వకుర్తి), జి.చిన్నారెడ్డి (వనపర్తి), ఎ.రేవంత్‌రెడ్డి (కొడంగల్‌), దొంతి మాధవరెడ్డి (నర్సంపేట) ఎ.మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్‌), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌), నాయిని రాజేందర్‌రెడ్డి (వరంగల్‌ వెస్ట్‌), సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్‌), డి.శ్రీధర్‌బాబు (మంథని), గీతారెడ్డి (జహీరాబాద్‌), డి.కె.అరుణ (గద్వాల), షబ్బీర్‌ అలీ (కామారెడ్డి), పొన్నాల లక్ష్మయ్య (జనగామ), టి.జీవన్‌రెడ్డి (జగిత్యాల), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), రేగా కాంతారావు (పినపాక), ఆరేపల్లి మోహన్‌ (మానకొండూరు), ముఖేశ్‌గౌడ్‌ (గోషామహల్‌), ఫిరోజ్‌ఖాన్‌ (నాంపల్లి), సంభాని చంద్రశేఖర్‌ (సత్తుపల్లి).మర్రి శశిధర్‌రెడ్డి (సనత్‌నగర్‌), భిక్షపతి యాదవ్‌ (శేరిలింగంపల్లి), సుధీర్‌రెడ్డి (ఎల్బీ నగర్‌), విష్ణువర్దన్‌రెడ్డి (జూబ్లీహిల్స్‌).

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube