బాబు కి మరో ఎమ్మెల్యే హ్యాండ్..వైకాపాకా ..? జనసేనాకా..?

ఎన్నికలు దగ్గరపడుతున్న ఏపీలో రాజకీయ పరిణామాలు ఊపందుకున్నాయి ముఖ్యంగా టీడీపీ పార్టీ పరిస్థితి మాత్రం రోజు రోజుకి దయనీయంగా మారిపోయంది.పార్టీలో సీనియర్ నేతలు పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 Amanchi Krishna Mohan Joining Into Ysr Congress Party11-TeluguStop.com

గత కొన్ని రోజులుగా టీడీపీ చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వైసీపీలోకి జంప్ అవుతున్నారు అంటూ వచ్చిన వార్తలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి అయితే ఈ వార్తలు ఎక్కడో వైసీపీలో వాచ్చాయి అంటే పుకార్లు అనుకోవచ్చు కానీ టీడీపీ సొంత మీడియాలో సైతం ఈ వార్తలు హల్చల్ చేస్తున్నాయి దాంతో ఆమంచి వైసీపీ గూట్లోకి వెళ్ళడం ఖాయమని తేలిపోయింది.ఇదిలాఉంటే ఇప్పుడు టీడీపీకి మరొక ఎమ్మెల్యే బై బై చెప్పబోతున్నారట.

ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరూ అంటే.

చంద్రబాబు నాయుడుకి అధికారాన్ని కట్టబెట్టిన జిల్లా.ఆ జిల్లాలో ఉన్న 15 సీట్ల కి గాను అన్ని సీట్లు టీడీపీ ఖాతాలోకే వెళ్ళిపోయాయి.చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం కూడా ఆజిల్లాలోనే ఉంది అదే పశ్చిమ గోదావరి జిల్లా అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.

చంద్రబాబు జీవిత ఆశయంగా పోలవరం పూర్తి చేయాలని పెట్టుకున్న ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇప్పుడు బాబు కి ఘలక్ ఇవ్వనున్నారట.

వచ్చే ఎన్నికల్లోగా ఆయన పార్టీ మారనున్నారని టాక్ వినిపిస్తోంది.ఇదిలాఉంటే

ఏపీలో ఉన్న అన్ని రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఒక్క పోలవరంలో మాత్రమే టీడీపీ విజయం సాధించింది.ఆ పార్టీ నుంచి 2012 ఉప ఎన్నికల్లో ఓడిన మొడియం శ్రీనివాస్ గత ఎన్నికల్లో 15 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.పోలవరం ప్రాజెక్ట్ పేరుతో రకరకాల పరిహారాలు నియోజకవర్గ ప్రజలకు భారీగా ఇచ్చారు.ఈ పరిహారం విషయంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయనేది బహిరంగ రహస్యం…ఈ వ్యవహారంలో మొడియం కి సంభంధం ఉందనేది కూడా బహిరంగ విమర్శే.

అయితే ఇప్పుడు మొడియం టీడీపీ కి ఎందుకు గుడ్ బాయ్ చెప్పాలని అనుకుంటున్నారు అంటే.

ఒకానొక దశలో చంద్రబాబు ఎస్టీ కోటాలో మొడియం కు మంత్రి పదవి సైతం ఇవ్వాలనుకున్నాడు.

అయితే ఆయన పనితీరుపై ప్రజలలో ఉన్న ఆదరణపై నివేదిక తెప్పించుకున్న బాబు ఆయనకు మంత్రి పదవి కాదు కదా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం కూడా లేదని భావిస్తున్నారట అయితే సీఎం తనకి మంత్రి పదవి ఇవ్వడానికి అనుకూలంగా లేరని తెలుసుకున్న మొడియం బాబు పై ఒత్తిడి పెంచే క్రమంలో పార్టీ మార్పునకి సిద్దపడ్డారని టాక్ వినిపిస్తోంది.అంతేకాదు నక్సల్స్ దాడిలో మరణించిన అరకు ఎమ్యెల్యే కిడారి సర్వేశ్వరావు మరణించడంతో కిడారి పెద్ద కుమారుడు శ్రావణ్ కు ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఇచ్చే అవకాశం పై చంద్రబాబు సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు.

దీంతో మొడియం కల కలగానే మారనుంది.

అయితే ఇక టీడీపీలో వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోవడం , చంద్రబాబు సైతం దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆయన తిరిగి పోలవరంలో పోటీ చేసేందుకు వైసీపీ, జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.వైసీపీలో తెల్లం బాలరాజు స్ట్రాంగ్ గా ఉన్నారు.కానీ ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ఆయన్ను మారుస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల వైసీపీలో ఆర్ధిక కోణం నేపథ్యంలోనే టికెట్ల ఖరారు జరుగుతోంది.ఈ నాలుగేళ్లలో మొడియం భారీగా ఆస్తులు కూడబెట్టుకోవడంతో వైసీపీలోకి వెళ్లినా సీటు దక్కే ఛాన్స్ ఉంది.

లేనిపక్షంలో జనసేనలోకి జంప్ చేసైనా పోటీ చెయ్యాలని మొడియం చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube