పర్సు కొట్టేసిన ప్రభుత్వాధికారి...సిసి టివి పుటేజ్ తో అడ్డంగా దొరికిపోయాడు..

ఈ ప్రభుత్వాధికారికి క్లెప్టోమానియాక్ అనే వ్యాధి ఉందనుకుంటా.అదేనండి చేతివాటం ప్రదర్శించడం.

 Pakistani Bureaucrat Caught On Camera Stealing Kuwait Delegates Purse1-TeluguStop.com

దొంగతనం చేయడం వేరు.కొందరు తమకెంత ఉన్నా దొంగతనం చేసే అవసరం లేకున్నా,చేయకూడదు చేయకూడదు అని మనసు చెప్తున్న తమ చేతి వాటం ప్రదర్శిస్తుంటారు.

వారినే క్లెప్టోమానియాక్ అంటారు.మనలో కూడా చాలామంది చిన్న చిన్న వస్తువులు దొంగతనం చేసే అలవాటుంటుంది.

అదేదో కావాలని చేసేది కాదు.కాని చేయకపోతే మన మనసు ఊరుకోదు…సరే అది పక్కనపెట్టి విషయానికి వద్దాం…పాకిస్తాన్ కి చెందిన ప్రభుత్వాధికారి ఒకరు ఇలాగే చేతివాటం ప్రధర్శించాడు… చివరకి ఎలా దొరికిపోయాడో తెలుసా.


పాక్-కువైట్ దేశాల మధ్య జాయింట్ మినిస్టీరియల్ కమిషన్ మీట్‌ జరిగింది.ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఇరు దేశాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఈ సమావేశం తర్వాత అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.అయితే కువైట్‌కు చెందిన అధికారి.తన పర్సును అక్కడే ఓ టేబుల్‌పై పెట్టి మర్చిపోయాడు.కొద్దిసేపటి తర్వాత పర్సు విషయం గుర్తొచ్చి.

వెనక్కు తిరిగొచ్చాడు.తీరా టేబుల్‌పై చూస్తే కనిపించలేదు.

దీంతో షాకైన సదరు అధికారి.అక్కడి సిబ్బందిని ఆరా తీశాడు.

తన పర్సు కనబడటం లేదని అడిగారు.అక్కడే ఉన్న పాక్ ఇన్వెస్టిమెంట్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌ జాయింట్‌ సెక్రటరీ జరార్‌ హైదర్‌ ఖాన్‌‌ను కూడా అడిగారు.

అతడు తనకేం తెలియదని బుకాయించాడు.

టేబుల్‌పై పెట్టిన పర్సు ఎలా మాయమయ్యిందా అని ఆశ్చర్యపోయిన పాక్ అధికారులు.అనుమానంతో ఆ రూమ్‌లోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు.అక్కడి సీన్‌ను చూసి షాకయ్యారు.

చుట్టూ ఎవరూ లేని సమయం చూసి.టేబుల్‌పై ఉన్న పర్సును తీసి గబుక్కున తన కోటు జేబులో వేసుకొన్నాడు జరార్ హైదర్ ఖాన్.

తనకేం తెలియదన్నట్లు అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు.వీడియోతో అడ్డంగా బుక్కైన అధికారి.

పర్సును తిరిగి వెనక్కు ఇచ్చేశాడట.వీడియోతో సహా దొరికిపోవడంతో.

సదరు అధికారిపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన జరగడం దురదృష్టకరమని.

జరార్ చేసిన పని తమ దేశానికి తలవంపులు తెచ్చిందని పాక్‌ ఆర్థిక మంత్రిత్వశాఖ విచారం వ్యక్తం చేసింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.

పాక్ పరువు పోయింది.అదండీ విషయం…మీరూ చూడండి అతగాడి చేతివాటం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube