కాంగ్రెస్ కి 'మెగా'దెబ్బ...గులాబీ బాస్ తో గూడుపుఠాణీ....

తెలంగాణా రాజకీయాలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఎవరికీ అంతుబట్టడం లేదు.టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి టీడీపీ నుంచీ టీఆర్ఎస్ లోకి ఇలా ఒకరి తరువాత ఒకరుగా కీలక నేతలు జంపింగ్ చేస్తూనే ఉన్నారు దాంతో చివరి వరకూ పార్టీలో ఎవరు ఉంటారో అర్థంకాకపోవడం వలన అధినేతలకి టెన్షన్ పెరిగిపోతోంది.

 Chiranjeevi Tension In Congress And Trs-TeluguStop.com

తమ పార్టీ నేతలు జారిపోకుండా ఉండటానికి కాంగ్రెస్ చేయని ప్రయత్నం అంటూ ఉండటం లేదు.కూటమి కట్టి టీడీపీ ని సైతం కలుపుకున్న కాంగ్రెస్ మెల్ల మెల్లగా తెలంగాణలో పాగా వేయాలని చూస్తుంటే.

కేసీఆర్ మాత్రం కూటమి కోటలు బీటలు వారెలా కాంగ్రెస్ కి దిమ్మతిరిగిపోయే స్కెచ్ లు వేస్తూ కూటమికి చెమటలు పట్టిస్తున్నాడు.అసలు విషయంలోకి వెళ్తే.

కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కూటమిలోకి టీఆర్ఎస్ ,బీజేపీ ,జనసేన తప్ప మిగిలిన అన్ని పార్టీలు దాదాపు చేరిపోయాయి.టీడీపీ ని కాంగ్రెస్ చేరుచుకోవడానికి ప్రధాన కారణం ఆంధ్రా ఓట్లు , కొద్దో గొప్పో మిగిలిపోయిన టీడీపీ కేడర్ ఓట్లు అయితే అందరికి తెలిసిన విషయము ఏమిటంటే.తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్ల ఓట్లతో కొన్ని నియోజకవర్గాల గెలుపు ఆధరపడి ఉంటుంది అయితే టీఆర్ఎస్ కి ఆంధ్రా ఓట్లు పూర్తి స్థాయిలో పడే అవకాశం లేనే లేదు దాంతో తెలంగాణలో ఒకే సారి ఆంధ్రా ఓట్లు పడాలి అదేవిధంగా టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఓట్లు కాంగ్రెస్ కి వెళ్ళకూడదు.అందుకే కేసీఆర్ ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాడు.

ఈ క్రమంలోనే కేసీఆర్ మెగా ఫ్యామిలీ వైపు దృష్టి మరల్చాడు.గత కొంతకాలంగా పవన్ తో సాన్నిహిత్యంగా ఉంటున్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వాల్సిందిగా రెండు నెలల క్రితమే కోరాడట.

జనసేన పార్టీలోకి దాదాపు తెలంగాణలో ఇప్పటికే 8 లక్షల మంది సభ్యత్వ నమోదు చేసుకున్నారు.అంతేకాదు ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాలకి అత్యంత కీలకమైనవి యూత్ ఓట్లు పవన్ కళ్యాణ్ కి తెలంగాణా వ్యాప్తంగా యువత ఓట్లు కూడా ఉన్నాయి.ఇవన్నీ కేసీఆర్ కి కలిసొచ్చే అంశాలే ఇక ఇక కీలకమైన

ఆంధ్రా ఓట్ల విషయంలోకి వెళ్తే…కేసీఆర్ ఈ విషయంలో సైతం మెగా ఫ్యామిలీ వైపు నుంచీ కధ నడిపిస్తున్నాడట.కాంగ్రెస్ తో ఇప్పటికే చిరు అంటీ ముట్టనట్టుగా వ్యవహరించడమే కాదు కర్ణాటక ఎన్నికలకి చాలా దూరంగా ఉన్నాడు చిరు.రాహుల్ ఆదేశాలు సైతం పట్టించుకోకుండా సైరా షూటింగ్ లో బిజీ బిజీ అని తప్పించుకుంటున్నాడట దాంతో ఈ విషయాన్ని గ్రహించిన కేసీఆర్ మెగాస్టార్ చిరంజీవితో గతంలోనే మెగాస్టార్ తో భేటీ అయ్యాడట.ఆంధ్రా ఓట్ల విషయంలో కానీ మెగా ఫ్యామిలీ కి సంభందించిన ఓట్ల విషయంలో టీఆర్ఎస్ కి మద్దతు ఉండాలని కోరారట దాంతో చిరు బయటకి వచ్చి బహిరంగంగా కాకపోయినా లోపాయి కారకంగా పని జరిగేలా చూస్తానని ఇంటర్నల్ గా మా పూర్తి మద్దతు ఉంటుందని మాట ఇచ్చారట…దాంతో ఒక పక్క జనసేన పార్టీ మద్దతు మరో పక్క మెగా ఫ్యామిలీ మద్దతు ఇంకో పక్క వైఎస్ఆర్ పార్టీ జగన్ మద్దతు కూడా ఉండటంతో కేసీఆర్ గెలుపుకి తిరుగులేదు అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube