పీపుల్ టెక్ గ్రూప్ కంపెనీకి అమెరికా భారీ జరిమానా.

రెండ్మెండ్ కేంద్రంగా పీపుల్ టెక్ గ్రూప్ కంపెనీ ఐటీ కార్యకలాపాలు చేస్తోంది ఈ కంపెనీకి వివిధ దేశాలలో ఆఫీసులు కూడా ఉన్నాయి.దాదాపు మూడు దేశాల్లో కలిపి 10 ఆఫీసులు వరకూ ఈ సంస్థకి ఉన్నాయి.

 Big Penalty On People Tech Group Company For Miss Using Hb 1 Approval-TeluguStop.com

ఇండియాలో హైదరాబాద్ ,అధోని ,బెంగుళూరు లలో కూడా ఆఫీసులు కలవు అయితే ఈ కంపెనీ లో పని చేస్తున్న ఉద్యోగులకి సరైన జీతాలు ఇవ్వని కారణంగా ఈ సంస్థకి అమెరికా ప్రభుత్వం భారీ జరిమానా విధించింది.

రెండ్మెండ్ కేంద్రంగా ఉన్న ఈ కంపెనీలోని తన ఉద్యోగులకు నిబంధనలకు విరుద్ధంగా తక్కువ జీతం ఇస్తున్నారని లేబర్ వేజ్ అండ్ హవర్ డివిజన్ విభాగం గుర్తించడంతో 12 మంది హెచ్‌ 1 బీ ఉద్యోగులకు మూడు లక్షల డాలర్లను ఇవ్వాలని ఆ కంపెనీని ఆదేశించింది.అలాగే నిబంధనలు ఉల్లంఘించినందుకు 45 వేల డాలర్ల ఫైన్‌ విధించింది.అయితే హెచ్ 1బి వీసాలను ఐటీ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని అమెరికా ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది.

అయితే ఈ కంపెనీ హెచ్ 1 బి కంప్యూటర్ అనలిస్టులు, కంప్యూటర్ ప్రొగ్రామర్స్ గా పనిచేస్తున్న వారికి ఎప్పటి నుంచో ఎంట్రీ లెవల్ జీతాలు ఇస్తున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు…ఎంతో అనుభవం ఉన్న ఈ ఉద్యోగులుకు భారీ జీతాలు ఇవ్వాల్సి ఉండగా కంపెనీ తక్కువ జీతంతో పనిచేయిస్తున్నారని అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో మిగిలిన కంపెనీలు అలెర్ట్ అవుతాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube