భక్తులకు వినాయకుడి బహిరంగ లేఖ… వారెలా నా భక్తులవుతారు అంటూ ప్రశ్నల వర్షం.!

ప్రియమైన భక్తులకు… ప్రేమతో మీ ఏకదంతుడు వ్రాయనునది.

 Ganpati Anopen Letter Todevotees Vinayaka-TeluguStop.com

నవరాత్రులు భక్తితో మీరు చేసే పూజలకు ధన్యవాదములు.

కానీ ఈ రోజు మీకు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను.మా అమ్మ నన్ను మట్టితోను, పసుపుతోను, చేసింది మీరేమో నన్ను ప్లాస్టర్ ఆఫ్ పారీస్ తో చేస్తున్నారు.

నన్ను ఎవరైతే పూజింపదలిచారో ఆ కుటుంబ యజమాని అంగుష్ఠం (బ్రోటనవ్రేలు) ఎత్తు మాత్రమే నా ప్రతిమ ఉండాలని వేదాలలో చెప్పారు మరి మీరు….నా ప్రతిమలు ఎంత పెద్దగా చేస్తున్నారో….

అంగుష్ఠం ఎత్తు ఉన్నా, 50అడుగుల ఎత్తు ఉన్నా నా చూపు మీ భక్తి మీదే ఉంటుంది గాని ఎత్తు మీద గాదని గుర్తుంచుకోండి.నా విగ్రహం ముందు వేద పారాయణం లేదు,శ్రావ్యమైన సంగీతం లేదు .అదేదో.కెవ్వుకేక అట ఆ వెకిలి పాటల హోరుకు నా ఇంత పెద్ద చెవులే మూసుకుపోతున్నాయి, ఇక మీ హోరుకు నా మూషికుని పరిస్థితి చెప్పక్కరలేదు.

రకరకాల పిండివంటలు, నైవేద్యాలకు కొదువ లేదు గాని నిమజ్జనం రోజును తలుచుకుంటే మీరు పెట్టే నైవేద్యాలన్నీ చేదనిపిస్తున్నాయి.ఓక్కో వీధిలో వందల కొద్ది నా విగ్రహాలు పెట్టి, నాకు పార్టీలు,కులాలు అంటగట్టి .నాకు, నాకే పోటీ పెట్టి తమాషా చూస్తున్నారు.ఇక నన్ను మీ ఇష్టమైన విధంగా తీర్చిదిద్దుకుంటున్నారు బాహుబలి, సూపర్ మాన్, స్పైడర్ మాన్, అవతార్ ఇలా రకరకాలుగా చేసి అవమానిస్తున్నారు మీ ఇంట్లో పెద్దలకు ఇలా వివిధ రకాలుగా కనీసం ఫోటోలు గా నైనా చూసుకోగలరా? మరి నన్ను దేవుని గా కొలుస్తూ ఏమిటీ ఈ పిచ్చి పనులు ? నేను మీకు పిచ్చి అనుకోవాలా? లేక మరేదైనా నా? నిమజ్జనం రోజు భక్తి ముసుగులో మీరు చేసే పనులు అంతా, ఇంతా కాదు, నా విగ్రహం వెనకాల క్వార్టర్ బాటిళ్ళ కేసులు, గుడుంబా క్యానులు, నా విగ్రహం ముందు త్రాగి తూలుతూ వికృత విన్యాసాలు, హోరెత్తే డ్రమ్ముల, మైకుల రణగోణ ధ్వనులు…

త్రాగి మైమరచి మీరు వేసే కేకలకు మీ నోటినుండి వచ్చే గుడుంబా తుంపరలు పన్నీరుగా నామీద చిలకరిస్తూ నన్ను ఊరేగిస్తున్నారు, మీ దగ్గర వచ్చే గుడుంబా వాసన కంటే హుసేన్ సాగర్ నీటి కంపు ఎన్నోరెట్లు మేలనిపిస్తుంది.ఇలాంటి వారిని నా భక్తులుగా ఎలా అంగీకరించగలను? మీరే చెప్పండి.

మీ

వినాయకుడు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube