టీఆర్ఎస్ గెలుపుపై పీకే సర్వే... రిజల్ట్ ఇదే

ఇప్పుడు రాజకీయాలన్నీ తెలంగాణ ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి.తెలంగాణ ఫలితాలు ఎంతో కొంత ఏపీపై కూడా పడే అవకాశం కనిపిస్తుండడంతో… ఏపీలోని అన్ని ప్రధాన రాజకీయ నాయకుల ద్రుష్టి మొత్తం తెలంగాణ మీదే పెట్టారు.

 Prashant Kishor Survey On Trs Party-TeluguStop.com

అసలు తెలంగాణాలో అధికార పార్టీ పరిస్థితి ఎలా ఉంది .? ఎలా ఉండబోతోంది.? ఎన్ని సీట్లు గెలుచుకోబోతోంది .? ఇలా అనేక అంశాలతో జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ తాజాగా ఓ సర్వే చేపట్టినట్టు తెలుస్తోంది.

పీకే చేపట్టిన ఈ సర్వేలో టీఆర్ఎస్ కు మొత్తం 56 సీట్లు వస్తాయని తేలిందట.అసెంబ్లీ రద్దు చేసిన తరువాత అది కూడా అభ్యర్థులను ప్రకటించిన తరువాత చేసిన ఈ ప్లాష్‌ సర్వే అధికార పార్టీకి సాధారణ మెజార్టీ కంటే తక్కువలోనే ఉందని తేలిందట.సాధారణ మెజార్టీ కావాలంటే మరో నాలుగు సీట్లు కావాల్సి ఉంది.తెలంగాణాలో కేసీఆర్ కి ఆదరణ ఉందని ఆయన మళ్లీ సీఎం కావాలని దాదాపు 47 శాతం మంది కోరుకుంటున్నట్టు సర్వేలో తేలిందట.

ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ఇంత వరకు తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేని స్థితిలో ఉండడంతో కాంగ్రెస్ కి పెద్ద మైనెస్ గా మారిందని తేలింది.

అసెంబ్లీని రద్దు చేసిన తరువాత టీఆర్ఎస్ పై గణనీయమైన వ్యతిరేకత వచ్చిందని.

గ్రామీణ ప్రాంతంలో, అర్బన్‌ ప్రాంతాల్లో ఆ పార్టీ రోజు రోజుకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయనే సర్వే తేల్చింది.మొత్తం 67 నియోజకవర్గాల్లో ప్రశాంత్ కిషోర్ టీమ్‌ సర్వే చేయగా ప్రతి చోటా ఆ పార్టీకి 40శాతం మాత్రమే మద్దతు లభించిందట.

ఆగస్టు 15న కేసీఆర్ చేయించిన సర్వేలో ఆ పార్టీ దాదాపు 69 స్థానాల్లో గెలుస్తుందని తేలగా.ఇప్పుడు 56 సీట్లకు వచ్చిందని రాబోయే రోజుల్లో.

మరింతంగా టిఆర్‌ఎస్‌ క్షీణించబోతోందని సర్వే ఫలితాలను బట్టి తేలుతోంది.

అయితే పీకే టీమ్ చేసిన ఈ సర్వేపై ప్రతిపక్ష కాంగ్రెస్‌, టిడిపి,సిపిఐలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.ఆ సర్వేను నమ్మలేమని, ఆయన బిజెపి, జగన్‌ పార్టీల మనిషి అని.ఈ రెండు పార్టీలు ‘కెసిఆర్‌’కు స్నేహితులు కనుక టీఆర్ఎస్ కి లాభం చేకూర్చేలా సర్వే ఫలితాలను ప్రకటించారని ఆరోపిస్తున్నాయి.ఎన్నికలు ఎప్పుడు జరిగినా టిఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమని.ఆ పార్టీలు స్పష్టం చేస్తున్నాయి.కెసిఆర్‌ రోజుకో సర్వే పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారని వారు విమర్శించారు.అయితే పీకే టీమ్ చేసిన సర్వే ఫలితాలు ఇటు టీఆర్ఎస్ కి కూడా మింగుడుపడడంలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube