సక్సెస్ స్టోరీ: ఆ కుర్రాడు ఒకప్పుడు రోడ్డుపక్కన సిమ్ కార్డులు అమ్మాడు..ఇప్పుడు 6000కోట్లకు అధిపతి.!

మనం ఏదైనా కొత్త ఊరికి వెళ్లినప్పుడు అక్కడ ఎక్కడ ఉండాలో.ఏ హోటల్లో దిగాలో.

 Ritesh Agarwal Is The Young Founder Ceo Of Oyo Rooms-TeluguStop.com

మనం వెళ్లిన హోటల్లో రూమ్స్ ఖాలీ ఉంటాయో ఉండవో.ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో.

ఇలా రకరకాలుగా ఇబ్బంది పడేవాళ్లం.కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు ఎందుకంటే OYO వుంది కదా…ఓయో రూమ్స్ వెబ్‌సైట్, యాప్‌లో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు.

రోడ్డు పక్కన వెళ్తుంటే అక్కడ ఓ హోటల్ కనిపిస్తుంది.దాని మీద OYO అని రాసి ఉంటుంది.

ఇలా చాలా ఊళ్లలో, చాలా చోట్ల వేలాది హోటళ్ల మీద ఇలా OYO అని రాసి ఉంటుంది.గమనించే ఉంటారు కదా.ఆ ఓయో వెనుక.ఆ సైట్స్ వెనుక ఉన్న కుర్రాడే మన హీరో రితేష్ అగర్వాల్.

అతడు ఇప్పుడు 6000కోట్లకు అధిపతి.కానీ ఒకప్పుడు రోడ్డుపక్కన సిమ్ కార్డులు అమ్మేవాడు అంటే నమ్ముతారా.

కానీ నమ్మితీరాలి.

ఒడిశాలోని కటక్‌లో పుట్టిన రితేష్ అగర్వాల్.రాయగఢ్‌లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశాడు.ఐఐటీలో ఇంజినీరింగ్ చేద్దామనుకుని ఎంట్రన్స్‌ కోసం కోచింగ్ తీసుకున్నాడు.

కానీ సఫలం కాలేదు.ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో అడ్మిషన్ తీసుకున్నాడు.

ఢిల్లీలో ఉన్న వర్సిటీ క్యాంపస్‌కి కేవలం రెండే రోజులు వెళ్లాడు.ఈ చదువులు అవి మనకు ఎక్కవని రితేష్ కి అర్దం అయిపోయింది.

దాంతో చదువు మానేస్తానని తల్లిదండ్రులకు చెప్పాడు.మొదట తల్లిదండ్రులు కంగారుపడ్డారు.

తర్వాత ఎలాగో ఒప్పుకున్నారు.ఇప్పుడున్న సక్సెస్ అతనికి అంత ఈజీగా రాలేదు.

చదువు మానేసిన తర్వాత ఏం చేయాలో అర్ధం కాక రోడ్డుపక్కన సిమ్ కార్డులు అమ్మాడు.

రితేష్‌కి ఊర్లు తిరగడం అంటే సరదా.2009లో ఓసారి డెహ్రాడూన్, మసూరీ వెళ్లే అవకాశం వచ్చింది.అక్కడ ఉన్న సుందరదృశ్యాలు చూసి.

వీటి గురించి బయట జనాలకి పెద్దగా తెలియదనుకున్నాడు.అక్కడే రితేష్ కి ఈ ఐడియా వచ్చింది.

అప్పుడు ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభించి దాంట్లో అందర్నీ భాగస్వామ్యం చేయాలనుకున్నాడు.అలాగే,పర్యాటకులకు సేవలు అందించేందుకు హోటళ్లు, గెస్ట్‌హౌస్‌ల యజమానులతో కలసి ఓ పోర్టల్ ప్రారంభించాలనుకున్నాడు.

అలా 2011లో రితేష్ అగర్వాల్ ఓరావెల్ అనే కంపెనీని ప్రారంభించాడు.అతడి ఐడియా నచ్చి గుర్‌గావ్‌కి చెందిన మనీష్ సింగ్ అందులో పెట్టుబడి పెట్టి కో ఫౌండర్‌గా మారాడు.2012లో ఓరావెల్‌కి మంచి లాభాలు వచ్చాయి.కంపెనీని వృద్ధిలోకి తీసుకురావడానికి రితేష్ ఎన్నో కష్టాలు పడ్డాడు.

ప్రాపర్టీ యజమానులు, కస్టమర్ల చెంతకు సంస్థను తీసుకెళ్లే క్రమంలో పెట్టుబడి, మార్కెటింగ్ లాంటి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి.

ఓడిపోయిన వాడిని ఎవరూ పట్టించుకోరు.కానీ అదే ఒక్కసారి గెలిస్తే అందరూ వాడి గురించే ఆలోచిస్తారు.రితేష్ కంపెని విషయంలో అదే జరిగింది.

ఒకసారి సక్సెస్ పట్టాలు ఎక్కాక పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది.OYOలో ఇన్వెస్ట్ చేయడానికి సాఫ్ట్ బ్యాంక్ ముందుకొచ్చింది.

బ్యాంక్ సీఈవో మసాయోషీ సన్, రితేష్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు.హీరో ఎంటర్‌ప్రైజ్ రూ.1600 కోట్ల ఫండింగ్ చేయడానికి ముందుకొచ్చింది.ఆ నిధులను భారత్, దక్షిణాసియాల్లో కంపెనీ విస్తరణ కోసం వినియోగించనున్నారు.కొత్త ఇన్వెస్ట్‌మెంట్లతో కలుపుకొని కంపెనీ విలువ ప్రస్తుతం రూ.6000 కోట్ల వరకు చేరింది.ఇది మన రియల్ హీరో రితేష్ స్టోరీ…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube